Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి చేసిన‌ ఉక్రెయిన్

ఉక్రెయిన్ రష్యా భూభాగంపై దాడులను ముమ్మరం చేసింది. ఏప్రిల్ 5వ తేదీ సరిహద్దుల్లోని రోస్టోవ్ ప్రాంతంపై పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది.

ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్‌ ఫీల్డ్‌లో ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌ తెలిపింది. 20 మంది సిబ్బంది కూడా చనిపోయినట్లు వారు ప్రకటించారు.

రష్యా రక్షణ శాఖ మాత్రం 44 డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై మాత్రం స్పందించలేదు. ఒక విద్యుత్‌ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్‌స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్‌లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది.

India-Belgium Relations: ఈ రంగాలలో సహకారం మరింత బలోపేతం!!

#Tags