Mumbai Weather: ముంబైలో బీభత్సం సృష్టించిన గాలివాన
ఒక అక్రమ హోర్డింగ్ కూలిపడటంతో 9 మంది మృతి చెందగా, 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన 65 మందిని ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి జాతీయ విపత్తు స్పందన బృందంతో సహా అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలివాన కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
గాలివాన ధాటికి ముంబైలోని పలు ప్రాంతాల్లో బిల్ బోర్డులు, హోర్డింగులు కూలిపడ్డాయి. వడాల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలి ముగ్గురు గాయపడ్డారు. చెట్లు నేలకొరిగిన ఘటనల్లో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మరో నలుగురు మరణించినట్లు సమాచారం. థానె, పాల్ఘర్ తదితర ప్రాంతాల్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది.
Heavy Rains in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో భారీ వరదలు.. 300 మంది మృతి!!