Finance Ministry: జీఎస్‌టీతో భారీగా తగ్గిన ఉత్పత్తుల ధరలు

వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంతో గృహావసర ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

దీనితో 'పన్నులపరంగా ఉపశమనం లభించి, ఇంటింటా ఆనందం వచ్చిందని' పేర్కొంది. జీఎస్‌టీ అమలులోకి వచ్చి ఏడేళ్లయిన సందర్భంగా ఆర్థిక శాఖ ఈ విషయాలను వెల్లడించింది.

➢ అన్‌ప్యాక్డ్‌ గోధుమలు, బియ్యం, పెరుగు, లస్సీ వంటి వాటిపై జీఎస్‌టీ అమలుకు ముందు 2.5–4 శాతం పన్ను ఉండేది. కానీ ఇప్పుడు వాటిపై పన్ను లేదు.
➢ కాస్మెటిక్స్, రిస్ట్‌ వాచీలు, శానిటరీ ప్లాస్టిక్‌ వేర్, ఫర్నిచర్‌ వంటి వస్తువులపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.
➢ 32 అంగుళాల వరకు టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు, గీజర్లు వంటి వాటిపై 31.3 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అవి 18 శాతం శ్లాబ్‌లోకి వచ్చాయి.
➢ రూ.2 కోట్ల వార్షిక టర్నోవరు వరకు ఉన్న చిన్న వ్యాపారాలకు రిటర్నులు దాఖలు చేయడం నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది.

S&P Global Ratings: ఎస్‌అండ్‌పీ గ్లోబల్ అంచనా ప్ర‌కారం భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతంటే..

జీఎస్‌టీ ప్రభావాలు ఇవే.. 
➢ 2017 జూలై 1 నుంచి 17 రకాల స్థానిక పన్నులు, సెస్సులకు బదులుగా జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది.
➢ నిబంధనల పాటింపు మెరుగుపడింది, ట్యాక్స్‌పేయర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
➢ 2018లో 1.05 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ ట్యాక్స్‌పేయర్ల సంఖ్య 2024 ఏప్రిల్ నాటికి 1.46 కోట్లకు చేరింది.

#Tags