DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఎంతంటే..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభ‌వార్త‌.

ఉద్యోగులకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), పెన్షనర్లకు డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)ను మూడు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ వారి మూలవేతనంలో 45 శాతానికి చేరింది. ఈ పెంపు జులై 1, 2024 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్‌ వేతనం అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి అదనంగా రూ.540 పెంపు ఉంటుందని అంచనా. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)లో మార్పులు చేస్తుంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. 

మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి, దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో రెండోసారి ప్రకటిస్తారు. అందులో భాగంగానే ఈ నెల చివరివారంలో దీపావళి ఉండడంతో డీఏ పెంపును ప్రకటించినట్లు తెలిసింది. 

Organ Donation: అవయవదాతల్లో.. పురుషుల కంటే... మహిళలే ఎక్కువ!!

ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు శాతం పెంపు
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అక్టోబ‌ర్ 16వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించారు. దీపావళి పండగ సీజన్‌కు ముందు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3.9 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఈ పెంపు అక్టోబర్ 1 నుంచి అమలు కానుందని పేర్కొన్నారు.

#Tags