Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా
Sakshi Education
జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా అక్టోబర్ 16వ తేదీ(బుధవారం) ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.
శ్రీనగర్‌లోని షెరి కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు.
అలాగే.. జమ్మూ ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి ఉప ముఖ్యమంత్రిగా, సకీనా మసూద్, జావేద్ దార్, జావేద్ రాణా, సతీష్ శర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక జమ్మూకశ్మీర్ రాష్ట్రం.. జమ్మూకశ్మీర్, లఢఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత తొలిసారి జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఘన విజయం సాధించడంతో.. ఆ పార్టీ అగ్రనేత ముఖ్యమంత్రి అయ్యారు.
దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా గుర్తింపు పొందారు. గతంలో ఆయన జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Published date : 17 Oct 2024 10:13AM