Andhra Pradesh Debt: తెలుగు రాష్ట్రాల అప్పులు ఎంతో తెలుసా..?

ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.5.62 లక్షల కోట్లకు చేరుతాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు.

ఇవి జీఎస్‌డీపీలో 34.70% భాగంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఏపీ అప్పులు 34.58% జీఎస్‌డీపీతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు.. తెలంగాణ రాష్ట్రానికి రూ.4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కూడా పంకజ్ చౌదరి అన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 24వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.

అలాగే.. కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల్లో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని, అయితే అదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని తెలిపారు. ఈ ఐటీ కంపెనీల ద్వారా గత 5 సంవత్సరాల్లో రూ.14,865 కోట్ల టర్నోవర్ వచ్చిందని ఆయన వివరించారు.

Our Schools and Our Future: మ‌న బ‌డి-మ‌న బ‌విష్య‌త్తుకు రూ.407.91 కోట్లు

#Tags