Success Story: వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడేళ్ల నిరీక్ష‌ణ‌. కోరుకున్న ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఈ ఏడేళ్ల స‌మ‌యం ఆమెకు పెద్ద క‌ష్టంగా అనిపించ‌లేదు. జీవితంలో అనుకున్న‌ది సాధించుకునేందుకు పెద్ద‌యుద్ధ‌మే చేయాల్సి వ‌చ్చింది. యుద్ధం అంటే ప‌రిస్థితుల‌తో.. మ‌నుషుల‌తో కాదు.. స‌మ‌యంతో ఆమె యుద్ధం చేసింది.
వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

ఏడేళ్లంటే మామూలు విష‌యం కాదు. దీనికితోడు వ‌రుస‌గా ఫెయిల్యూర్లు. చివ‌రికి అన్నింటిని అధిగ‌మించి తాను కోరుకున్న ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ సాధించింది. తాజాగా విడుద‌లైన యూపీఎస్సీ ఐఎఫ్ఓఎస్ ఫ‌లితాల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించిన అనుష్క లోహియ స‌క్సెస్ స్టోరీ....  

☛  IAS Success Story: వ‌రుస‌గా మూడు సార్లు ఫెయిల్‌.. త‌ర్వాత ఐఆర్ఎస్‌.. దాని త‌ర్వాత ఐఎఫ్ఎస్‌.. ఆ త‌ర్వాత‌ ఐఏఎస్ సాధించిన సూర్య‌భాన్ స‌క్సెస్ స్టోరీ

చిన్నప్పటి నుంచి పక్షులను వీక్షించడం, ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల అనుష్కకు అడ‌వుల‌పై ఆమెకు మ‌క్కువ ఏర్ప‌డింది. పర్యావరణ ప్రేమికురాలిగా మారింది. దీంతో ఐఎఫ్ఎస్ అవ్వాల‌ని చిన్న‌త‌నంలోనే నిర్ణ‌యించుకుంది. 

కుటుంబ నేప‌థ్యం.....
అనుష్క‌లోహియా మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగై తాలూకాకు చెందినవారు. ఆమె తండ్రి లాతూర్ లోని దయానంద్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేసి ప్ర‌స్తుతం రిటైర‌య్యారు. తల్లి డాక్ట‌ర్‌. వారి గ్రామంలోనే ఒక చిన్న ఆసుపత్రిని నడుపుతున్నారు. ద‌యానంద్ దంప‌తుల‌కు అనుష్క‌ ఏకైక సంతానం. 

☛  IAS Varun Baranwal Success Story: 15 ఏళ్ల‌కే తండ్రిని కోల్పోయి... సైకిల్ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి... 23 ఏళ్ల‌కే ఐఏఎస్ సాధించిన వరుణ్ భరన్వాల్ స‌క్సెస్ స్టోరీ

విద్యాభ్యాసం ఇలా...
10వ తరగతి వరకు ప్రాథమిక విద్యను స్థానికంగా అభ్యసించారు. ఆ తర్వాత లాతూర్ నుంచి 11, 12వ తరగతి పూర్తి చేసింది. 2016లో పుణెలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి B.Tech పూర్తి చేసింది.

ప్రిప‌రేష‌న్ ఇలా...
గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 2016లో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ప్రారంభించింది. మొదట్లో యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ రెండింటికీ ప్రిపేర్ అయ్యారు. 2017, 2018లో ఆమె చేసిన మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రాథ‌మిక ప‌రీక్షైన ప్రిలిమ్స్‌లోనే ఉత్తీర్ణత సాధించలేకపోయింది. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు అర్హ‌త సాధించింది. 

☛  NEET 2023 Ranker Inspirational Story : 11 ఏళ్ల‌కే పెళ్లి... 20 ఏళ్ల‌కు పాప... ఐదో ప్ర‌య‌త్నంలో నీట్ ర్యాంకు సాధించిన రాంలాల్ ఇన్‌స్పిరేష‌న‌ల్‌ స్టోరీ

మార్కులు వ‌చ్చినా....
మెయిన్స్‌ రాసేటప్పుడు సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్‌ కంటే ఐఎఫ్ఎస్‌పై ఎక్కువ ఆసక్తి ఉందని ఆమె గ్రహించింది. దీంతో ఐఎఫ్ఎస్ మెయిన్స్ రాసినా దురదృష్టం ఆమెను వీడ‌లేదు. ఆ తర్వాత 2020లో నాలుగో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ పరీక్ష మాత్రమే రాసి ఇంటర్వ్యూ స్థాయికి చేరుకుంది. ఇంటర్వ్యూలో అత్యధిక మార్కులు (2016) వచ్చినా మెయిన్స్ పరీక్షలో ఆప్షనల్ స‌బ్జెక్ట్‌లో తక్కువ మార్కులు రావడంతో తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. 

ఏడాది గ్యాప్ తీసుకుని...
జాబ్ వ‌చ్చింది అని సంతోషించేలోపే తుది జాబితాలో పేరులేక‌పోవ‌డంతో ఆమె నిశ్చేష్టురాలైంది. దీంతో ఏడాది గ్యాప్ తీసుకోవాల‌నుకుని 2021లో ప‌రీక్ష రాయ‌లేదు. ఆ స‌మ‌యంలో త‌న త‌ప్పు ఒప్పుల‌ను రివైజ్డ్ చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్ గా సివిల్ ఇంజినీరింగ్‌ను తీసుకుంది. ఐదో ప్ర‌య‌త్నంలో దానిస్థానంలో ఆప్షనల్ సబ్జెక్టుగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (ఏఈ)ను తీసుకుంది. 

ఐదో ప్ర‌య‌త్నంలో...
ఐదో ప్ర‌య‌త్నంలో టెస్ట్ సిరీస్ ల కోసం కోచింగ్ తీసుకుంది. ఇంటర్వ్యూ కోసం ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ మెంటార్‌షిప్ తీసుకుంది. డేను మూడు భాగాలుగా విభజించి ప్ర‌తీ రోజు మూడు సబ్జెక్టులను అధ్యయనం చేసేది. లెక్క‌లేన‌న్ని మాక్ టెస్ట్‌లు అటెండ్ అయ్యేది. చివ‌రికి ఐఎఫ్ఎస్-2022లో ఐదవ ప్రయత్నంలో ఆల్ ఇండియా 4వ ర్యాంకుతో తన జీవిత ల‌క్ష్యాన్ని సాధించింది.

☛ IAS Anju Sharma Success Story: ప‌ది, ఇంట‌ర్‌లో ఫెయిల‌య్యా... ఈ అప‌జ‌యాలే న‌న్ను 22 ఏళ్ల‌కే ఐఏఎస్‌ను చేశాయ్‌... అంజు శ‌ర్మ స‌క్సెస్ స్టోరీ

ధ్యానంతో ఒత్తిడిని అధిగ‌మించి...
ప్రిపరేషన్ ప్రారంభించిన తొలినాళ్లలో భయాన్ని, ఒత్తిడిని అధిగ‌మించేందుకు మెడిటేష‌న్ ప్రారంభించింది. ఏకాగ్రతతో పాటు ప్రశాంతంగా ఉండటానికి త‌న‌కు ధ్యానం ఎంత‌గానో సహాయపడటమే కాకుండా నైపుణ్యాలను పెంచిందని అనుష్క త‌న అనుభ‌వాల‌ను పంచుకుంది.

ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న‌లు ఇలా...
ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్ట్‌గా అగ్రిక‌ల్చ‌ర్ ఇంజినీరింగ్‌ను ఎంపిక‌చేసుకోవ‌డంతో ఇంట‌ర్వ్యూలో ఎక్కువ‌గా ఆ విభాగం నుంచే ఆమెకు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిస్థితులు, జీవవైవిధ్యం మీద ఎక్కువ‌గా ప్రశ్నలు అడిగిన‌ట్లు ఆమె తెలిపింది. 

అలాగే ఆమెది మ‌హారాష్ట్ర కావ‌డంతో... ఛత్రపతి శంభాజీ నగర్ ను గతంలో ఔరంగాబాద్ అని ఎందుకు పిలిచేవారని, ఆ పేరును ఎందుకు మార్చారనే ప్ర‌శ్న‌ను కూడా అడిగిన‌ట్లు ఆమె మీడియాకు తెలిపింది. అలాగే వ‌ర్త‌మాన అంశాల‌పైనా ప్రశ్నలు అడిగార‌ని... మణిపూర్ లో ఎందుకు ఘర్షణలు జ‌రుగుతున్నాయి? దీని వెనుక ప్రధాన కారణం ఏమిటి? మణిపూర్ సమస్యను పరిష్కరించాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి ప్ర‌శ్న‌లు త‌న‌కు ఎదుర‌య్యాయ‌ని ఆమె తెలిపింది. 

 UPSC topper Ishita Kishore’s marks: అద‌ర‌గొట్టిన యూపీఎస్సీ టాప‌ర్ ఇషితా కిషోర్‌... ఆమెకు వ‌చ్చిన‌ మార్కులు ఎన్నంటే...

చివ‌ర‌గా...
2020 నుంచి ఆమె మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద ఫెలో రీసెర్చ్ గా చేస్తున్నారు. గ‌తేడాదే ఆమె వివాహం చేసుకున్నారు. ఆమె భ‌ర్త సివిల్ ఇంజినీర్‌. ఐఎఫ్ఎస్ మెయిన్స్ ప‌రీక్ష‌కు ముందు ఆమె త‌న ఫెలో రీసెర్చ్ కు రాజీనామా చేశారు.

#Tags