Success Story : మేము నలుగురం ఉన్నత స్థాయిలో ఉన్నామంటే.. వీరే కారణం..
మాది ఖమ్మం జిల్లా . ‘మా అమ్మ అనంతం లక్ష్మి హిందీ పండిట్‌గా, నాన్న దశరథరామయ్య హెచ్‌ఎంగా విధులు నిర్వర్తించేవారు.
మేము నలుగురం ఆడపిల్లలమే కావటంతో హిందీ పండిట్‌గా ఉద్యోగం మా అమ్మ లక్ష్మి గృహిణిగా ఉంటూ ఉన్నతంగా తీర్చిదిద్దింది. మా అక్క లలిత టీచర్‌గా, ఇంకో అక్కడ ఇందిర న్యూజిలాండ్‌లో ప్రొఫెసర్‌గా, శ్రీదేవి కోయ్యలగూడెంలో హెచ్‌ఎంగా చేస్తున్నారు.
ఆస్తి, అంతస్తుల కంటే మాకు..
నేను ప్రభుత్వాస్పత్రిలో వైద్యురాలిగా స్థిరపడ్డా. మా నలుగురిని ఉన్నతంగా తీర్చిదిద్దటంలో అమ్మ కృషి మరువలేనిది. రాత్రిపూట మేం ఎంత చదువుకున్నా మాతో ఉంటూ ప్రోత్సహించేది. ఆస్తి, అంతస్తుల కంటే చదువు, నీతి, నిజాయతీ ముఖ్యమనే అమ్మ మాటలు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఆడపిల్లలను ఏ మాత్రం తక్కువగా చూడకుండా చేయూతనిస్తే ఏ రంగంలోనైనా దూసుకెళ్తారు’ అని సత్తుపల్లి ఏరియా ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ వసుమతీదేవి వెల్లడించారు.
☛ SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..
#Tags