Inspiring Success Story : వాచ్‌మెన్ డ్యూటీ చేస్తూ.. ఐఐఎం ప్రొఫెసర్ అయ్యానిలా.. స‌రిగ్గా తలుపులు కూడా లేని ఇంట్లో..

అప్పుడు నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసిన రంజిత్ రామచంద్రన్ ఇప్పుడు ఐఐఎం ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. ఈత‌ను ఎందుకు నైట్ వాచ్‌మెన్‌గా ప‌నిచేశారు..? నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ ఎలా అయ్యాడే చూద్దామా..

స‌రిగ్గా తలుపులు కూడా లేని ఇంట్లో ఉంటూ..

ఒక బ‌ల‌మైన‌ సంకల్పం ఉన్నవారు లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి అవరోధాలను లెక్కచేయరని మరోసారి నిరూపితమైంది. కొన్నాళ్ల క్రితం నైట్ వాచ్‌మెన్‌గా పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ఐఐఎం(IIM)లో ప్రొఫెసర్‌ అయ్యారు. మట్టి గోడలతో నిర్మించిన, సరైన తలుపులు కూడా లేని ఇల్లు ఆ ప్రొఫెసర్‌ది.

Inspirational Success Story : వీళ్ల నోళ్లు మూయించి.. ఉన్న‌త ఉద్యోగం కొట్టాడిలా.. చివ‌రికి..

కేరళకు చెందిన రంజిత్ రామచంద్రన్ సక్సెస్ స్టోరీ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఒక శిథిలమైన, పాత పెంకుల గుడిసె తన ఇళ్లు అని చెప్పాడు. వర్షానికి తడవకుండా దానికి పైకప్పుగా పెద్ద టార్పాలిన్ కవర్ ఉంది. అలాంటి ఇంట్లో పుట్టిన రంజిత్ ఇప్పుడు ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికయ్యారు. 

పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా..
కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న పనాతూరుకు చెందిన 28 ఏళ్ల ఈ యువకుడి ప్రస్థానాన్ని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఉన్నత లక్ష్యం కోసం అతడు పడిన కష్టం ప్రశంసనీయమని చెబుతున్నారు.

Inspiration Story: ఓ నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చి..వేల కోట్లు సంపాదించాడిలా..

కుటుంబ నేప‌థ్యం :

ఆ ఇంట్లో అతడి తండ్రి, తల్లి, ఇద్దరు తోబుట్టువులు.. మొత్తం ఐదుగురు నివసిస్తున్నారు. తండ్రి ఒక టైలర్. తల్లి దినసరి కూలీ. ఈ స్థాయికి రావడానికి రంజిత్ ఎంతో కష్టపడ్డాడు. కుటుంబ పోషణ కష్టం కావడంతో ఒక దశలో చదువు మానేయాలనుకున్నాడు.

Inspirational Story : నాడు పుస్తెలతాడు కూడా తాకట్టు పెట్టా..నేడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నానిలా..

కానీ ఆ ఆలోచనను పక్కనపెట్టి పార్ట్ టైమ్ ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్(BSNL) టెలిఫోన్ ఎక్స్చేంజ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పని చేశాడు. ఇందుకు రూ.4,000 జీతంగా ఇచ్చేవారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూడటం అతడి బాధ్యత. ఇలా ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్య పూర్తి చేశాడు.

ఇలా చ‌దివి..

రంజిత్ ముందు నుంచి చదువుల్లో ముందుండేవాడు. అతడు మరాఠీ మాట్లాడే షెడ్యూల్డ్ తెగకు చెందినవాడు.  ఎస్‌టీ (ST) రిజర్వేషన్ కూడా ఉంది. చదువులో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అతడు వందశాతం సద్వినియోగం చేసుకున్నాడు. రంజిత్ రాజాపురంలోని పీయస్ టెన్త్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ కోర్సులో చేరాడు. ఆ త‌ర్వాత‌ కాసర్‌గోడ్‌లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చదివాడు. పీజీ పూర్తి చేసే వరకు ఐదేళ్ల పాటు నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం మానలేదు. పీజీ తరువాత ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశాడు.

Success Story : పెట్టుబ‌డి రూ.2 లక్ష‌లే.. టర్నోవర్ మాత్రం కోట్ల‌లో.. ఇదే మా విజ‌య ర‌హ‌స్యం..

ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేక..

పీహెచ్‌డీ (PhD) చేసే సమయంలో ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేక రంజిత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో పరిశోధన కొనసాగించడం కష్టంగా మారింది. ఫలితంగా ఒక దశలో పీహెచ్‌డీని వదిలేయాలి అనుకున్నాడు. కానీ తన గైడ్ ఇచ్చిన ప్రోత్సాహంతో రిసెర్చ్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఐఐఎం(IIM)లో ప్రొఫెసర్‌గా పనిచేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసి ఫలితం సాధించాడు.

☛ Inspiring Success Story : ప‌రీక్ష‌ల్లో ఫెయిల్‌.. జీవితంలో పాస్‌.. ఏడాది రూ.2 కోట్ల పైగా ఆదాయంతో..

తనలాంటి ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే..
రంజిత్ బెంగళూరులోని క్రైస్ట్ కాలేజీలో రెండు నెలల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఇటీవల జరిగిన నియామకాల్లో రాంచీ ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తనలాంటి ఎంతోమంది యువకుల్లో స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో తన సక్సెస్ స్టోరీని ఫేస్‌బుక్  ద్వారా పంచుకున్నానని రంజిత్ తెలిపారు.

☛ Inspiring Success Story : ఈ ఐడియాతో రూ.33 వేల కోట్లకు అధిపతి అయ్యాడిలా..

☛ Success Story: పెట్టుబ‌డి రూ.50 వేలు.. ఆదాయం రూ.20 కోట్లు.. ఇదే నా సక్సెస్ మంత్ర..

#Tags