Gold Medal in Medical Exams: వైద్య ప‌రీక్ష‌ల్లో బంగారు ప‌త‌కం సాధించిన యువ‌తి

డాక్ట‌ర్ అవ్వాల‌ని ఆశించ‌డ‌మే కాదు అందుకు శ్ర‌మించి, ప‌ట్టుద‌ల‌తో సాధించ‌గ‌లం అని నిరూపించింది పోస్టు గ్రాడ్యువేట్ విద్యార్థిని. ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో ఆమె మొద‌టి స్థానాన్ని సంపాదించి బంగారు ప‌త‌కాన్ని గెలిచిన యువ‌తి ఇప్పుడు ఎంతోమందికి స్పూర్తి.
Medical student Shiva Priyanka awarded with gold medal

సాక్షి ఎడ్యుకేష‌న్: పీజీ వైద్య పరీక్షల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల పోస్టు గ్రాడ్యుయేషన్‌ (గైనకాలజీ) విద్యార్థి డాక్టర్‌ శివప్రియాంక సత్తా చాటారు. స్టేట్‌ టాపర్‌గా నిలిచి, బంగారు పతకం సాధించారు. గత నెలలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రంలోని 30 కళాశాలల నుంచి గైనకాలజీ విభాగంలో 186 మంది పరీక్షలు రాశారు. 700 మార్కులకు డాక్టర్‌ శివప్రియాంక 527 (75.29 శాతం) మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు.

Semester Instant Exams: September 21 నుంచి డిగ్రీ పరీక్షలు

ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆరేపల్లి శ్రీదేవి, గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌బేగం, ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంధ్యలు డాక్టర్‌ శివప్రియాంకను శాలువ, పూలమాలతో సన్మానించారు. శివప్రియాంక రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. డాక్టర్‌ శివప్రియాంక మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌ఫెర్టిలిటీపై ఫెలోషిప్‌ చేసి భవిష్యత్తులో పేదలకు మెరుగైన వైద్య సేవలందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుచిత్రశౌరీ, గైనకాలజిస్టులు పాల్గొన్నారు.

Guest Faculty Posts: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

#Tags