Inspirational Success Story : కంటి చూపు లేకున్నా.. రూ.47 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించానిలా.. కానీ..

మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించాలనే బ‌ల‌మైన‌ సంకల్పం నీకుంటే విజయం తప్పకుండా దాసోహం అవుతుంది అంటారు పెద్ద‌లు. ఈ మాటను స‌రిగ్గా అచ‌రించి విజ‌యం సాధించాడు.. యష్ సోనాకియా. అలాగే ప్రతిభకు ఏ శారీరక లోపం అడ్డు కాదు అని నిరూపించాడు.

తన ఎనిమిదవ ఏటనే చూపో కోల్పోయినప్పటికీ పట్టు వదలకుండా ప్ర‌పంచ‌లోనే అత్యంత పేరుగాంచిన‌ మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం కొట్టాడు. ఈ నేప‌థ్యంలో యష్ సోనాకియా స‌క్సెస్ స్టోరీ మీకోసం.. 

ఏ మాత్రం నిరాశ చెందకుండా..

మధ్యప్రదేశ్‌కి చెందిన యష్ సోనాకియా పుట్టినప్పుడే అతనికి గ్లాకోమా ఉందని డాక్టర్లు నిర్దారించారు. అయితే అతనికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి చూపు కోల్పోయాడు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్‌వేర్ కావాలని కళలు కన్న యష్ చూపు కోల్పోయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తన వైకల్యాన్ని అధిగమించి 2021లో  శ్రీ గోవింద్రం సెక్సరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (SGSITS) నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

☛ Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత యష్ సోనాకియాకు ఒక మంచి బంపర్ ఆఫర్ లభించింది. అతనికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ 47 లక్షల వార్షిక వేతనం అందిస్తూ జాబ్ ఇచ్చింది. కళ్ళు లేని వ్యక్తి ఇంత గొప్ప ప్యాకేజీతో జాబ్ సంపాదించడం అనేది సాధారణ విషయం కాదు. యష్ తండ్రి యశ్‌పాల్ ఇండోర్‌లో క్యాంటీన్ నడుపుతున్నాడు. తన కొడుకు ఇంత మంచి జాబ్ తెచుకున్నందుకు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. ఈ యువ‌కుడి స‌క్సెస్ జ‌ర్నీ.. నేటి యువ‌త‌కి స్ఫూర్తిదాయ‌కం.

☛ Success Story : రూ.60 లక్షల జీతంతో జాబ్ కొట్టా.. 67,000 మందిని ఓడించి.. ఎలా అంటే..?

#Tags