Education news: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

Education news

పలమనేరు: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చిందని డీఈవో విజయేంద్రరావు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం జరిగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

నాడు–నేడు కింద బడులను తీర్చిదిద్దారు కాబట్టి గురువులుగా మనం కూడా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అధ్యక్షత వహించిన సంఘం జిల్లా గౌరవ సలహాదారు సోమచంద్రారెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా విద్యారంగంలో సంస్కరణలు వచ్చాయన్నారు.

సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యువరాజ్‌రెడ్డి, జయకాంత్‌, ఏఎంసీ చైర్మన్‌ హేమంత్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ వెల్ఫేర్‌ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ అమరనాథ్‌, నాయకులు పుష్పావతి, ఏఆర్‌కుమార్‌, పట్టాభిరామయ్య, రోషల్‌ అలీఖాన్‌, రమేష్‌ గిరిధర్‌, వడయార్‌ తదితరులు పాల్గొన్నారు.

#Tags