Quiz Competitions for Degree Students : ఆర్బీఐ-90 వేడుక‌ల్లో డిగ్రీ విద్యార్థుల‌కు క్విజ్ పోటీలు.. ద‌ర‌ఖాస్తులు గ‌డువు..!

ఆర్బీఐ–90 పేరుతో దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించనుంది.

విజయనగరం: మనదేశంలో ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ 90వ ఏడాదిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆర్బీఐ–90 పేరుతో దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించనుంది. వివిధ స్థాయిల్లో జగరనున్న పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు రూపంలో బహుమతులు అందజేయనుంది.

Govt College for Men : ప్ర‌భుత్వ పురుష డిగ్రీ క‌ళాశాల‌కు ప్లాటినం జూబ్లీ వేడుకలు.. పాల్గొన్న పూర్త విద్యార్థులు..

● పోటీ, నమోదు ఇలా..

క్విజ్‌ పోటీల్లో అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలు, ఆర్బీఐ డిజిటల్‌ కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ, సాహిత్య, చరిత్ర, ఆటలు, శాస్త్ర సాంకేతిక విషయాలతో పాటు సమకాలీన అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పోటీల్లో తలపడేందుకు 2024 సెప్టెంబర్‌ 1 నాటికి 25 ఏళ్లలోపు ఉండి, ఏదైనా డిగ్రీ కళాశాలలో చదువుతున్నవారు అర్హులు. www.rbi90quiz.in వెబ్‌సైట్‌లో పేరు, ఐడీ, ఈమెయిల్‌, ఫోన్‌ నంబర్‌, తదితర వివరాలను ఈనెల 17వ తేదీ లోగా నమోదు చేసుకోవాలి. ఒక కళాశాల నుంచి ఎంతమందైనా పాల్గొనవచ్చు. ఒక జట్టులో ఇద్దరు తప్పనిసరిగా ఉండాలి. జిల్లా, రాష్ట్ర, జోనల్‌, జాతీయ స్థాయిల్లో ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో పోటీలు నిర్వహిస్తారు. ప్రతి స్థాయిలో విజేతలైన వారే తర్వాత దశకు అర్హత పొందుతారు.

● విజేతలకు నగదు బహుమతులు

జిల్లా స్థాయిలో విజయం పొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులు. అక్కడ గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.2 లక్షలు, రెండో బహుమతిగా రూ.1.5 లక్షలు, మూడో బహుమతిగా రూ. లక్ష లభిస్తాయి. జోనల్‌ స్థాయిలో రూ.5 లక్షలు, రూ. 4 లక్షలు, రూ.3 లక్షలు వరుసుగా అందిస్తారు. అనంతరం జరిగే జాతీయ స్థాయి విజేతలకు రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు ప్రైజ్‌మనీగా అందజేస్తారు. పోటీలు సెప్టెంబర్‌ 19 నుంచి 21వ తేదీ వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదవుతున్న వేల మంది విద్యార్థులకు ఇది సదవకాశం.

దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 17 వరకు గడువు.

Medical Colleges : వైద్య క‌ళాశాల‌లు ప్ర‌వేటుకు.. విద్యార్థుల భ‌విష్య‌త్తు..!

#Tags