New Courses at ITI: ప్రభుత్వ ఐటీఐలో ఆరు నూతన కోర్సులు

పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధికి దోహదం చేస్తున్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను భవనాలు, పరికరాలు, మౌలిక వసతులతో ఆధునీకరించనున్నారు.

మంచిర్యాల: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునీకరణలో భాగంగా టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (టీటీఎల్‌)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.5 కోట్ల వ్యయంతో నూతన భవనం పనులు చేపట్టాల్సి ఉంది.

Students Talent: ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ చాటి ఏపీయూలో సీటు సాధించిన యువ‌కులు వీరే!

ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌ అన్‌ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆధ్వర్యంలో టెండర్లు పూర్తయ్యాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐలో ఆరు నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెకానిక్‌, వెల్డర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(కోపా), సోలార్‌ టెక్నీషియన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌ టెక్నాలజీ కోర్సులు ఉండగా.. 432 సీట్లు ఉన్నాయి. ఐటీఐల ఆధునీకరణతో డిమాండ్‌ ఉన్న కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

Distance Education: దూరవిద్య డిగ్రీ ఫలితాల విడుదల,రీవాల్యుయేషన్‌ దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..

అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మెకానిక్‌ టెక్నీషియన్‌ కోర్సులో 48 సీట్లు, ఇండస్ట్రీయల్‌ రొబొటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌ 40, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ అండ్‌ ఆటోమిషన్‌ 40, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ 48, ఆర్టీషియిన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌టూ 48, బేసి క్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌(మెకానికల్‌) కోర్సులో 48 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణతో సమస్యలు తీరిపోనున్నాయని, కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభించే అవకాశాలున్నాయని ఐటీఐ ప్రిన్సిపాల్‌ చందర్‌ తెలిపారు.

Intermediate First Year Admissions: తెలంగాణ మోడ‌ల్ స్కూల్లో ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రానికి ద‌ర‌ఖాస్తులు..

#Tags