NAAC At AU: వ‌ర్సిటీలో నాక్ క‌మిటీ సంద‌ర్శ‌న‌

ఏయూలో పర్య‌ట‌న చేప‌ట్టిన నాక్ క‌మిటీ స‌భ్యులు క‌ళాశాల‌ను సంద‌ర్శించారు. అనంతరం సిబ్బందుల‌తో స‌మావేశమ‌య్యారు..
NAAC Members visit to Andhra University

సాక్షి ఎడ్యుకేషన్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాక్‌ కమిటీ పర్యటన విజయవంతంగా సాగుతోంది. రెండవ రోజైన ఆదివారం కమిటీ సభ్యులు మూడు బృందాలుగా విడిపోయి వర్సిటీ మొత్తం కలియతిరిగారు. ఫార్మసీ కళాశాల తరగతి గదులు, ప్రయోగశాలలు, వసతి గృహాలు, వైద్య కేంద్రం, క్రీడా విభాగం, సంగీత–నృత్య విభాగాలు, థియేటల్‌ ఆర్ట్స్‌, జపాన్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌, సెయింట్‌ లూక్స్‌ ఆడియో, ఇంజినీరింగ్‌ విభాగం, న్యాయ కళాశాల, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ తదితర విభాగాలను సందర్శించారు.

➤   Job Mela: తిరుప‌తిలో ఉద్యోగావ‌కాశం..

మధ్యాహ్నం విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, వర్సిటీ ఉద్యోగులు, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. ఎన్‌ఎస్‌ఎస్‌, సంగీత, క్రీడా విభాగాలను సందర్శించిన కమిటీ సభ్యులు విద్యార్థుల ప్రగతి, పతకాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్‌ వీడియో రికార్డింగ్‌ స్టూడియో వసతులు చూసిన సభ్యులు అచ్చెరువొందారు.

#Tags