College Inspection: కళాశాలలో న్యాక్‌కి ముందు ఈ కమిటీ సభ్యుల సందర్శన..!
పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర కాలేజీయేట్ కమిషనర్ డాక్టర్ పోల.భాస్కర్ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీసభ్యులు బుధవారం వస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ITI Admissions: రేపటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ..
తమ కళాశాలకు నాక్ (జాతీయగుర్తింపు నిర్ధారణచేసే కౌన్సిల్) బృందం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రానున్నందున ముందస్తుగా ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అమరావతి నుంచి డాక్టర్ కె.విజయ్‌బాబు (ఓఎస్డీ), డాక్టర్ జె. జాన్‌కిరణ్ (అకడమిక్ ఆఫీసర్), ఈ.వరప్రసాద్(అకడమిక్ ఆఫీసర్)లు కళాశాలకు వస్తున్నట్లు తెలిపారు. వీరు కళాశాలను సందర్శించి నాక్ కమిటీ వచ్చే సమయానికి చేయాల్సిన పనులు, రికార్డులు, అకడమిక్ విధానం, విద్యాప్రమాణాలు పెంచేందుకు తగు సూచనలు, కళాశాలలో మెరుగు పరచాల్సిన పలు అంశాలు, అకడమిక్ కార్యకలాపాల మెరుగుకు సూచనలు, సలహాలను అందిస్తారని తెలిపారు. కళాశాలలో బోధన సిబ్బందితో మాట్లాడి బోధనలో తీసుకోవాల్సిన అంశాలపై వివరిస్తారని తెలిపారు.
First Class Students: ఈనెల 10లోగా ఉచిత సీట్లలో విద్యార్థులను చేర్పించాలి..!
Tags
- college inspection
- naac members
- Srivenkateswara Govt Degree College
- committee members
- Academic officers
- State Collegiate Commissioner Dr. Pola Bhaskar
- NAAC Grading
- Principal Dr. Chintala Chalapathy Rao
- students education
- college grade by NAAC
- National Assessment and Accreditation Council
- Education News
- Sakshi Education News
- parvatipuram manyam news
- Parvathipuram
- statecommissioner
- Announcement
- DrPolaBhaskar
- ChintalaChalapathyRao