Degree Examination: యలమంచిలి డిగ్రీ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

విద్యార్థులకు నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షలను గంటన్నరలోనే ఆపేసి పేపర్లను లాగేసుకున్నారు అక్కడి అధికారులు. ఈ విషయాన్ని యూనివర్సిటీ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు.. అసలేం జరిగిందంటే..

సాక్షి ఎడ్యుకేషన్‌: యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు గంటలు నిర్వహించాల్సిన థియరీ పరీక్షను గంటన్నరలోనే ముగించి, కాలేజీ అధికారులు విద్యార్థులకు చుక్కలు చూపించారు. అదేంటి సార్‌ పరీక్ష సమయం 3 గంటలు కదా ? అని ప్రశ్నిస్తే అదేమీ కాదు.. గంటన్నరే అంటూ దురుసుగా మాట్లాడుతూ జవాబు పత్రాలను లాగేసుకున్నారు. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

DSC Notification: ఉపాధ్యాయ ఉద్యోగాలకు డీఎస్‌ఈ నోటిఫికేషన్‌..!

వివరాలివి.. ఈ విద్యాసంవత్సం నుంచి డిగ్రీలో ఆనర్స్‌ డిగ్రీ (సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌) కోర్సును కొత్తగా ప్రవేశపెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో మొదటి సెమిస్టర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం బీఏ, బీఎస్సీ, బీకాం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించాల్సివుంది. బయాలజీ విద్యార్థులకు క్లాసికల్‌ బయాలజీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఏఐ, డాటా సైన్స్‌ మేజర్‌ కోర్సులు చదివే వారికి అప్లికేషన్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ ఫిజికల్‌ అండ్‌ కెమికల్‌సైన్స్‌ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీకాం కోర్సులు చదివే విద్యార్థులకు ఫండమెంటల్స్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఫండమెంటల్స్‌ కామర్స్‌ పరీక్షలు జరిగాయి.

Model Foundation School: మోడల్‌ ఫౌండేషన్‌ స్కూల్‌ ఎంపికకు పరిశీలన

శుక్రవారం నాడు విద్యార్థులకిచ్చిన ప్రశ్నాపత్రంలో సమయం కూడా 3 గంటలుంది. కానీ యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 గంటలకు పరీక్ష ప్రారంభించి 10.30 గంటలకే జవాబు పత్రాలను లాగేసుకున్నారు. ఇదేమిటని విద్యార్థులు వెళ్లి పరీక్షా కేంద్రం నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఈ పరీక్ష కేంద్రంలో యలమంచిలి పట్టణం, అచ్యుతాపురంలో ఉన్న పలు ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారంతా నిర్వాహకుల తీరును చూసి ఆందోళన చెందారు. ఇదే సమయంలో పట్టణంలో ఉన్న మరో రెండు ప్రైవేట్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాత్రం 3 గంటల సేపు పరీక్ష నిర్వహించారు.

10th Class: పది ఫలితాల్లో జిల్లాను ముందుంచాలి

ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు

ఈ విషయమై పలువురు విద్యార్థులు యలమంచిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరిటెండెంట్‌ పి.చంద్రశేఖర్‌కు రాతపూర్వక వినతిపత్రం అందజేశారు. ఇదే విషయాన్ని ఏయూ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. వారితో పాటు పట్టణ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రం నిర్వాహకులను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి రమణ, స్థానిక నేతలు నిలదీశారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్‌ వారికి హామీ ఇచ్చారు.

School Inspection: పాఠశాలల్లో తనిఖీలు.. ఉపాధ్యాయులకు తాఖీదులు..!

నేడు మళ్లీ పరీక్ష

వాస్తవానికి పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థుల జవాబు పత్రాలను సీల్‌ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్ర పర్చాల్సి ఉంటుంది. ఏయూ అధికారులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను డిపాజిట్‌ సెంటర్‌గా కేటాయించారు. అన్ని పరీక్ష కేంద్రాలకు చెందిన విద్యార్థుల జవాబు పత్రాలను భద్రపరిచి ఏయూకు పంపాల్సి వుంటుంది. శుక్రవారం గంటన్నర సమయానికి విద్యార్థుల నుంచి జవాబు పత్రాలను లాగేసుకుని తప్పు తెలుసుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రం నిర్వాహకులు నాలుక్కరచుకున్నారు. ఇదేమని విద్యార్థి సంఘ ప్రతినిధులు నిలదీస్తే, ఇదే పరీక్షను మళ్లీ శనివారం మధ్యాహ్నం మరో గంటన్నర వరకూ రాసేందుకు అనుమతిస్తామని చెప్పారు.

Certificates Verification: గ్రేడ్‌-2 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన..!

పొరపాటును సరిచేస్తాం

శుక్రవారం మా కళాశాలలో జరిగిన పరీక్ష ఎంసెట్‌ కాదు కదా. చిన్న పొరపాటు జరిగింది. విద్యార్థులకు న్యాయం చేయడానికి శనివారం ఉదయం పరీక్ష పూర్తయ్యాక మధ్యాహ్నం సమయంలో శుక్రవారం జరిగిన పరీక్ష జవాబు పత్రాలను విద్యార్థులకిచ్చి గంటన్నర సమయం ఇస్తాం. శుక్రవారం పరీక్ష నిర్వహించడంలో పొరపాటు జరిగింది. యూనివర్సిటీ నుంచి వచ్చిన ఫొటో ఎస్‌ఈఎఫ్‌–7 ఫారాలపై ఉదయం 9 నుంచి 10–30 గంటలని ముద్రించడంతో అదే నిజమనుకున్నాం. ఈ సమస్య తలెత్తినప్పుడు ఏయూ అధికారులకు పలుమార్లు ఫోన్‌ చేసినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదు. మా వల్ల జరిగిన పొరపాటును సరిచేస్తాం.

Job Offer for Unemployed: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా..

–చంద్రశేఖర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, యలమంచిలి

#Tags