Skip to main content

Degree Semester Results 2024: డిగ్రీ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల..

Degree Semester Results 2024

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో వివిధ గ్రూప్‌లకు సంబంధించి సెమిస్టర్‌ 2, 4, 6 రెగ్యులర్‌, 1, 2, 3, 4, 5, 6 బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను బుధవారం పాలమూరు యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ మధుసూదన్‌రెడ్డి విడుదల చేశారు.

2వ సెమిస్టర్‌లో రెగ్యులర్‌ విద్యార్థులు 919 మందికి గాను 355 మంది, 4వ సెమిస్టర్‌లో 935 మందికి గాను 489 మంది, 6వ సెమిస్టర్‌లో 919 మందికి గాను 812 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మావతి తెలిపారు.

UGC-NET 2024 : యూజీసీ–నెట్‌ రద్దు

కార్యక్రమంలో పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ రాజ్‌కుమార్‌, అడిషనల్‌ కంట్రోలర్‌ నాగభూషణం, శాంతిప్రియ, విజయలక్ష్మి, సత్యనారాయణగౌడ్‌, ఈశ్వరయ్య, తిరుపతయ్య పాల్గొన్నారు.

 

 

Published date : 20 Jun 2024 03:33PM

Photo Stories