Skip to main content

Results 2025: డిగ్రీ మొదటి సెమిస్టర్‌ ఫలితాల విడుదల!

అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్‌ఎన్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో గత డిసెంబర్‌లో నిర్వహించిన మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఎస్కేయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, డైరెక్టర్‌ ఆఫ్ ఎవాల్యూయేషన్ ప్రొఫెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ లోకేష్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేసీ సత్యలత ఫలితాలను విడుదల చేశారు.
Govt degree college Results 2025 declared news in telugu

ఈసారి 647 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరవ్వగా, 584 మంది (90.26%) ఉత్తీర్ణత సాధించారు.
🔹 బీఏ ఆనర్స్ – 92 మంది విద్యార్థులలో 79 మంది ఉత్తీర్ణులయ్యారు.
🔹 బీకాం ఆనర్స్ – 226 మంది విద్యార్థులలో 198 మంది పాస్ అయ్యారు.
🔹 బీఎస్సీ ఆనర్స్ – 300 మంది విద్యార్థులలో 284 మంది విజయం సాధించారు.

ఫలితాలు & రీవాల్యూయేషన్ వివరాలు

📌 ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో గురువారం అందుబాటులో ఉంచనున్నారు.
📌 రీవాల్యూయేషన్ & పర్సనల్ వెరిఫికేషన్ కోసం ఫిబ్రవరి 6 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 రీవాల్యూయేషన్ ఫీజు ₹300, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు ₹600గా నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ హెచ్‌ఎస్ శివశంకర్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రమణ నాయుడు, అధ్యాపకులు రామలింగారెడ్డి, బి. రామకృష్ణ, అంజన రెడ్డి, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు!

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 10:04AM

Photo Stories