Job Offer for Unemployed: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా..
Sakshi Education
నిరుద్యోగులకు, ఆసక్తిగల వారికి ఉద్యోగావశం కల్పించేందుకు ఓ సంస్థ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అర్హులు, ఆసక్తిగల వారు దీనిని వినియోగించుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు..

సాక్షి ఎడ్యుకేషన్: ఈ నెల 21న స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్మాణ్ స్వచ్ఛంద సేవా సంస్థ, మైక్రోసాఫ్ట్ కంపెనీల సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ టి.రాధాకృష్ణ తెలిపారు. జాబ్ మేళాలో పది కంపెనీలు పాల్గొని, ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావచ్చన్నారు.
Certificates Verification: గ్రేడ్-2 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన..!
చోడవరం పరిసర మండలాల్లోని నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు. ఇతర వివరాల కోసం ఉద్యోగ మేళా కోఆర్డినేటర్ హెచ్.సుధీర్‌ను 7780688683 నంబర్‌లో సంప్రదించాల్సిందిగా తెలిపారు.
Published date : 19 Feb 2024 11:22AM