Skip to main content

10th Class: పది ఫలితాల్లో జిల్లాను ముందుంచాలి

దేశాయిపేట : పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందుంచేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషిచేయాలని డీఈఓ డి.వాసంతి సూచించారు.
district should be promoted in tenth results

దేశాయిపేటలోని లక్ష్మి గార్డెన్స్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఫిబ్ర‌వ‌రి 16న‌ నిర్వహించిన ఓరియంటేషన్‌ ప్రోగ్రాంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఓరియంటేషన్‌ కార్యక్రమానికి 65 పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థులు హాజరయ్యారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ట్రస్మా రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ ఎన్‌.రమేష్‌రావు, అడ్వైజర్‌ కె.భూపాల్‌రావు, డీసీఈబీ చైర్మన్‌ కృష్ణమూర్తి, ఎంఈఓ విజయ్‌కుమార్‌, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జునరెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్‌ గుమ్మడవెల్లి సురేష్‌, నాయకులు బి.వెంకటేశ్వర్లు, డి.పంతులరామ్మూర్తి, వి.రాధాకృష్ణ, ఎన్‌.సూర్యనారాయణ, బొల్లం కనకయ్య, ఆర్‌.రవి, జె.విలియమ్స్‌, సుధీర్‌, వై.విద్యాసాగర్‌, ఎస్‌.సుధాకర్‌, జె.సంజీవ, ఖలీల్‌, నసీరుద్దీన్‌, మాధవి, అశోక్‌, రాజేందర్‌, సమీర్‌ ఇనాయత్‌ పాల్గొన్నారు.

Published date : 17 Feb 2024 12:51PM

Photo Stories