School Inspection: పాఠశాలల్లో తనిఖీలు.. ఉపాధ్యాయులకు తాఖీదులు..!
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖాధికారిగా ఎస్.అబ్రహం బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా జిల్లాలోని ఏలూరు, భీమడోలు మండలాల్లోని పలు పాఠశాలలను శుక్రవారం తనిఖీ చేశారు. ఏలూరు మండలంలోని ఆగడాలలంక జెడ్పీ ఓరియంటల్ ఉన్నత పాఠశాల, చెట్టున్నపాడు ప్రాథమిక పాఠశాల, కొక్కిరాయిలంక ప్రాథమిక పాఠశాల, గుడివాకలంక జెడ్పీ హైస్కూళ్లను పరిశీలించారు.
Model Foundation School: మోడల్ ఫౌండేషన్ స్కూల్ ఎంపికకు పరిశీలన
ఆగడాలలంక, గుడివాకలంకల్లో ట్యాబ్‌ల వినియోగం అతి తక్కువగా ఉండటం, ఇంటి వద్ద నుంచి విద్యార్థులు ట్యాబులు తీసుకు రాకపోవడాన్ని గుర్తించి సదరు ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు. అలాగే గుడివాకలంక హైస్కూల్‌లో నోట్‌బుక్స్ దిద్దని ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయులకు సైతం నోటీసులు ఇచ్చారు. చెట్టున్నపాడు, కొక్కిరాయిలంక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, మేధావుల జీవిత చరిత్రలను తెలుసుకుని స్ఫూర్తి పొందాలని సూచించారు.