Gurukul Inspection : గురుకులానికి సందర్శించిన సెక్రెటరీ.. విద్యార్థులకు పలు సూచనలు!
గన్నవరం రూరల్: విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదగాలని రాష్ట్ర గురుకులాల సెక్రటరీ కె.సునీల్ రాజ్‌కుమార్ అన్నారు. గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గురుకులంలో అమలవుతున్న బ్రిడ్జి కోర్సును సమీక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మెరుగైన విద్యాబోధన, ఉత్తమ ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలు సూచించారు. డైనింగ్ రూమ్‌ను పరిశీలించారు.
Sampoornata Abhiyan: ‘సంపూర్ణత అభియాన్’ను ప్రారంభించిన నీతి ఆయోగ్
గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి ఉపయోగించే మోటారు రిపేరు చేయడానికి ఆదేశిస్తూ కొత్త మోటారు కొనుగోలుకు అనుమతి మంజూరు చేశారు. పాఠశాల విద్యార్థుల ప్రగతిని సమీక్షించి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అధ్యాపకులను అభినందించారు. ఈ సంవత్సరం నూరు శాతం ఉత్తీర్ణతతో ముందుండటం మంచి పరిణామమని ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. ఏఎంవో ఎన్.సంజీవరావు, పలువురు అధికారులు ఈ సందర్శనలో పాల్గొన్నారు.
Anganwadi Centers : అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇవి తప్పనిసరిగా