DSC Notification: ఉపాధ్యాయ ఉద్యోగాలకు డీఎస్‌ఈ నోటిఫికేషన్..!
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. సచివాలయాలకు అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి మరిన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు.
Inter Practical Exams: ముగిసిన ప్రాక్టికల్ పరీక్షలు
అలాగే రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ హబ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా వివిధ సాంకేతిక విభాగాల్లో శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందిన వారికి నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించారు. అలాగే స్కిల్‌హబ్‌లు, జాబ్‌మేళాల ద్వారా సుమారు 15 వేల మందికి వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించారు. తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
Malabar Charitable Trust: విద్యతోనే మహిళా సాధికారత
ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలు
ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు యూనిఫాం, షూ, డిక్షనరీ వంటి వినూత్న చర్యలతో పాటు ప్రధానంగా మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు మంజూరు చేసి సర్కారీ బడుల రూపురేఖలు మారుస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి చూపించారు.
YS Jagan Mohan Reddy: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి
విద్యార్థులకు డిజిటల్ విద్యను చేరువ చేసి వారికి ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా గత ప్రభుత్వాలు పేరుకే డీఎస్సీలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేయకుండా మోసం చేస్తే.. అభ్యర్థులు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు. వీరి కలను నెరవేర్చేలా 1998 డీఎస్సీలో అర్హులైన 221 మందికి, 2008 డీఎస్సీలో అర్హులైన 180 మందికి సీఎం జగన్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోస్టింగ్‌లు ఇచ్చారు.
Degree Admissions: అంబేద‍్కర్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు..!
తాజాగా 306 పోస్టులతో..
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 306 పోస్టులు ఉన్నాయి. వాటిలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో స్పెషల్ గ్రేడ్ టీచర్లు 88, గిరిజన ప్రాంతాల్లో 14 , స్కూల్ అసిస్టెంట్లు 140, గిరిజన ఉపాధ్యాయులు 4, ఏపీటీడబ్ల్యూలో ఒకటి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా 6, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 31, ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 13, ఏపీఆర్‌ఈఐఎస్ ద్వారా 9 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.
వీటిలో వివిధ సంక్షేమ శాఖల ద్వారా 78 పోస్టులు, పాఠశాల విద్యాశాఖ ద్వారా 288 పోస్టులు భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ ద్వారా భర్తీ చేయనున్న పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు 19, స్కూల్ అసిస్టెంట్ హిందీ 31, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ 26, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 18, స్కూల్ అసిస్టెంట్ పీఎస్ 6, స్కూల్ అసిస్టెంట్ బీఎస్ 7, స్కూల్ అసిస్టెంట్ ఎస్‌ఎస్ 1, స్కూల్ అసిస్టెంట్ ఫిజకిల్ ఎడ్యుకేషన్ 32, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 88 ఉన్నాయి.
ప్రభుత్వ విద్య మరింత బలోపేతం
ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ అభినందనీయం. దీంతో ప్రభుత్వ విద్యారంగం మరింత బలోపేతం అవుతుంది. అలాగే రాష్ట్రంలో 6 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగితే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై పనిఒత్తిడి తగ్గి వారు బోధనపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది. డీఎస్సీ–2024 ప్రకటనను డెమోక్రటిక్ పీఆర్ టీయూ పక్షాన స్వాగతిస్తున్నాం.
– పి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డెమోక్రటిక్ పీఆర్‌టీయూ
సీఎం జగన్‌తోనే ఉద్యోగాల భర్తీ
రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వగలిగే సత్తా ఒక్క ముఖ్యమంత్రి జగన్‌కే ఉంది. గత ప్రభుత్వాలు నిర్వహించిన డీఎస్సీలకు సంబంధించిన ఉద్యోగాలను కూడా ముఖ్యమంత్రి జగనే భర్తీ చేసి ఆయా కుటుంబాల్లో ఆనందం నింపారు. ప్రస్తుత డీఎస్సీతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 3 వందల మందికి పైగా ఉద్యోగాలు పొందనున్నారు. డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది తీపికబురు.
– గెడ్డం సుధీర్, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి