Skip to main content

SBI Clerk Result 2024 Out: ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్‌ కోసం డైరెక్ట్‌ లింక్‌ క్లిక్‌ చేయండి

SBI Clerk Result 2024 Out SBI Junior Associate Prelims Results Out   Junior Associate (Clerk) Jobs Prelims Result announcement

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8773 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఉద్యోగాల ప్రిలిమ్స్ ఫలితాలను ఫిబ్రవరి 16న విడుదల చేసింది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూడొచ్చు. 

ఎస్‍బీఐ.. మెయిన్స్‌ పరీక్ష ఎప్పుడంటే..

ఎస్‍బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలను జనవరి 5, 6, 11, 12 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 25, మార్చి 4న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా మొత్తం 8773 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నియామక ప్రక్రియ చేపడుతోంది.

ఎస్‌బీఐ..తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులంటే..
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525 పోస్టులు, అమరావతి సర్కిల్లో 50 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.  

SBI Clerk Prelims Junior Associate Result కోసం.. https://bank.sbi/web/careers/crpd/clk-phase-1-2023 ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి. 

Published date : 19 Feb 2024 10:23AM

Photo Stories