Summer Holidays 2024 for Students : రేప‌టి నుంచే.. వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : కాలేజీల‌కు వేసవి సెలవులు మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభ‌కానున్నాయి. ఈ సారి కాలేజీకు భారీగా సెలవులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంట‌ర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 తర్వాతే కాలేజీలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

☛ AP Schools Summer Holidays 2024 : ఎండ ఎఫెక్ట్.. ఏపీలో ముందుగానే స్కూల్స్‌కు భారీగా వేస‌వి సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

అడ్మిషన్లు కూడా బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని తెలిపింది.  వేసవి సెలవుల్లో ఏ కళాశాల యాజమాన్యాలైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియేట్ విద్యా మండలి పేర్కొంది. ఈ షెడ్యూల్ తెలంగాణలోని అన్ని జూనియర్ కళాశాలల్లో అందించే అన్ని ఇంటర్మీడియట్ కోర్సులకు వర్తిస్తుంది. TSBIE వచ్చే విద్యా సంవత్సరానికి ప్రత్యేక అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది.

 April Month Holidays 2024 For Schools and Colleges : పండ‌గే పండ‌గ‌.. సెల‌వులే సెల‌వులు.. ఏప్రిల్‌లో స్కూల్స్‌, కాలేజీ, ఆఫీస్‌ల‌కు భారీగా హాలిడేస్‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags