Skip to main content

Good News for Inter students:ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ శిక్షణ

Inter Board initiatives for student coaching in government colleges   Good News for Inter students:ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో  ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ శిక్షణ
Good News for Inter students:ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ శిక్షణ

మల్లాపూర్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఇంటర్‌ బోర్డు కృషి చేస్తోంది. ఈ ఏడాది నుంచి ఎంసెట్‌, జేఈఈ, నీట్‌ కోసం శిక్షణ ప్రారంభించింది. ప్రైవేటు కళాశాలల్లో కేవలం కోచింగ్‌కే రూ.50వేల వరకు తీసుకుంటున్నారు. ఇది నిరుపేద కుటుంబాలకు ఆర్థికభారం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ ఉచితంగా కోచింగ్‌ ఇవ్వడం ద్వారా అడ్మిషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 15 కళాశాలల్లోని ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కోచింగ్‌ ఇస్తుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రోజుకు రెండు గంటలు..

ఈనెల ఏడో తేదీ నుంచి కోచింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు.. మధ్యాహ్నం మూడు నుంచి 4 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. ఆయా అధ్యాపకులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో కోచింగ్‌ ఇస్తున్నారు.

Also Read:  YouGov-Mint-CPR Millennial Survey: నెలకు ఎంత సంపాదిస్తే.. రిచ్‌ అనుకుంటారు?

సదుపాయాలు లేక..

కళాశాల్లో కోచింగ్‌ ప్రక్రియ అరకొర సదుపాయాల మధ్య కొనసాగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి ఇప్పటివరకు కోచింగ్‌ మెటీరియల్‌ పంపించలేదు. కొన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో నీటి సదుపాయం లేదు. మరి కొన్నిచోట్ల ప్రిన్సిపాల్స్‌ సొంత డబ్బుతో నీటి వసతి, చిన్నచిన్న మరమ్మతు చేయిస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు కోరుతున్నారు. తరగతులు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట కాకుండా.. ఉదయం లేదా సాయంత్రం ఒకపూటే నిర్వహిస్తే సౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కోచింగ్‌ ఇస్తుండగా.. మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published date : 25 Oct 2024 02:57PM

Photo Stories