AP Medical Colleges : ఏపీ మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్ర‌భుత్వం మొగ్గు..

ప్రైవేట్‌పై మోజులో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కలకు చంద్రబాబు ప్రభుత్వం గండి కొట్టింది.

అమరావతి: మెడికల్‌ సీట్లు ఇస్తామంటే ఎగిరి గంతేసి తీసుకోవాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వమే వద్దంటూ రాత పూర్వకంగా లేఖ ఇచ్చింది. దేశంలో ఎక్కడా లేని ఈ దుర్మార్గ పొకడపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. తద్వారా తమ ప్రభుత్వం ఏం చేసినా ప్రైవేట్‌ వ్యక్తులను అందలం ఎక్కించడం కోసమేనని మరోమారు నిరూపించుకుంది. 

ఈ ప్రభుత్వం ఏమీ చేయనప్పటికీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఈ విద్యా సంవత్సరం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో అడ్మిషన్‌లకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) అనుమతులు ఇస్తే.. కళాశాల నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అనుమతులు వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేసింది. సీట్లు మంజూరు చేసినప్పటికీ విద్యార్థులకు వసతులు క‌ల్పించలేమని ఎన్‌ఎంసీకి లేఖ రాసినట్టు తెలిసింది.

Inter Admissions Deadline Extended: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు, మన విద్యార్థుల ఎంబీబీఎస్‌ కలను సాకారం చేయడం కోసం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023–24 విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిల్లో ఒక్కో చోట 150 ఎంబీబీఎస్‌ సీట్లతో కళాశాలలను ప్రారంభించారు. 

ఈ విద్యా సంవత్సరం 150 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లతో పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందుల కళాశాలలు ప్రారంభించడానికి గత ఏడాది నుంచే చర్యలు ప్రారంభించారు.  ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీని సమకూర్చడం, అక్కడి సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం, వేగంగా వైద్య కళాశాలలను నిరి్మంచడంలో చొరవ చూపింది. దీంతో తొలి ఏడాది ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలల్లో 80 శాతం మేర సివిల్‌ పనులు పూర్తయ్యాయి.  

Education World India Rankings: మహిళా డిగ్రీ కళాశాల.. ‘సీమ’కే మకుటం

పులివెందులకు మాత్రం నో.. 
ప్రభుత్వ అండర్‌ టేకింగ్‌తో సంబంధం లేకుండా ఈ నెల 6వ తేదీన పులివెందుల కళాశాలకు 50 సీట్లతో అనుమతులు ఇస్తున్నామని ఎన్‌ఎంసీ.. రాష్ట్ర వైద్య శాఖకు సమాచారం ఇచ్చింది. అయితే తాము వసతులు కలి్పంచలేమని చెప్పినా ఎలా అనుమతులు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం వాదించినట్టు సమాచారం. అయినప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అదే రోజు ఎన్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిసింది. 

దీంతో ఇదే తరహాలో మిగిలిన మూడు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావించిన ప్రభుత్వం.. కొత్త వైద్య కళాశాలలకు తాము వసతులు కల్పించలేమని ఏకంగా ఎన్‌ఎంసీకే గోప్యంగా లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వమే విముఖత వ్యక్తం చేస్తుండటంతో చేసేదేమీ లేక ఆల్‌ ఇండియా రెండో విడత కౌన్సెలింగ్‌కు పులివెందుల కళాశాల సీట్లను మినహాయించి, పాడేరు కళాశాల సీట్లను మాత్రమే మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ సీట్‌ మ్యాట్రిక్స్‌లో ప్రకటించింది.  

Job Mela: రేపు జాబ్ మేళా.. రూ.3 లక్షల వ‌ర‌కు జీతం.. ఉండాల్సిన అర్హతలివే..!

ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం  
సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను గుజరాత్‌ పీపీపీ మోడల్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో కావాలనే ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సిన కళాశాలలను నిర్లక్ష్యం చేసింది. జూన్‌ నెలలో తొలి విడత కళాశాలల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్‌ఎంసీ స్వల్ప స్థాయిలో వసతుల కొరత ఉందని అనుమతులు నిరాకరించింది. 

ఈ కొరతను అధిగమిస్తే ఐదు చోట్ల వంద శాతం సీట్లతో ఈ కళాశాలలు ప్రారంభం అయ్యేవి. కాగా, ప్రైవేట్‌పరం చేయాలన్న లక్ష్యంతో మొక్కుబడిగా అప్పీల్‌కు వెళ్లి కళాశాలల్లో వసతుల కల్పన మాత్రం బాబు ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ అనంతరం తొలి విడత తనిఖీల్లో ఉన్న పరిస్థితులే ఉన్నప్పటికీ పులివెందుల కళాశాలకు 50 ఎంబీబీఎస్‌ సీట్ల మంజూరుకు ఎన్‌ఎంసీ అనుమతి ఇస్తామని వెల్లడించింది. 

Telangana MBBS Seats Increased : తెలంగాణ‌లో మొత్తం 8,915కు పెరిగిన‌ ఎంబీబీఎస్ సీట్లు.. పూర్తి వివ‌రాలు ఇవే...

ఇందుకోసం ప్రభుత్వం అండర్‌ టేకింగ్‌ ఇస్తే చాలని స్పష్టం చేసింది. అనంతరం అదే షరతులతో పాడేరు కళాశాలకు కూడా ఇదే తరహాలో 50 సీట్లతో అడ్మిషన్‌లతో లెటర్‌ ఆఫ్‌ పరి్మషన్‌ (ఎల్‌ఓపీ) మంజూరు చేసింది. పాడేరు కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటంతో అనుమతులు నిరాకరిస్తే ఆ నిధులు ఆగిపోతాయని భావించి అండర్‌ టేకింగ్‌కు ఒప్పేసుకుంది.

#Tags