Inter Marks Issue : ఇంటర్‌లో మార్కుల విషయంలో తల్లీకుమార్తెల మధ్య గొడవ.. కత్తిపోట్లు.. కూతురు మృతి.. తల్లి మాత్రం..!
ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితికి ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ తన కుమార్తెను అడిగింది. ఇది కాస్తా చిలికి చిలికి గాలి వానలా తయారయింది. ఇదే సమయంలో బాగా కోపంతో ఉన్న కూతురు ఇంట్లో ఉన్న కత్తి తెచ్చి తల్లిని నాలుగు సార్లు పొడించింది.
కూతురి మీద ఎదురుదాడి..
ఇది అక్కడితో ఆగినా బావుండేది. కానీ తల్లి కూడా ఊరుకోకుండా కూతురి మీద ఎదురుదాడికి దిగింది. కుమార్తెను పద్మజ కూడా ఇష్టం వచ్చినట్టు పొడిచింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. తీవ్ర కత్తి పోట్లకు గురవ్వడం వల్లనే కుమార్తె మరణించిందని బెంగళూరులోని బనశంకరి పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రక్తస్రావంతో ఉన్న పద్మజను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది.
కర్ణాటకలో మాధ్యమిక విద్య అంటే పీయూసీ, ఇంటర్‌కు సమానమైన కోర్సు ఫలితాలు ఈమధ్యనే విడుదల అయ్యాయి. ఇందులో కుమార్తెకు 40 మార్కులు తక్కువగా వచ్చాయనే ఈ గొడప జరిగింది.
☛➤ Twin Sisters Got Same Marks in 10th and Inter : విచిత్రం అంటే ఇదే ఏమో.. ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఇంటర్‌లో 620/625 ఒకే మార్కులు.. టెన్త్‌లో కూడా..
☛➤ State Level Rankers in PUC: పీయూసీ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన యువతులు వీరే.. ఇదే కారణం..