State Level Rankers in PUC: పీయూసీ పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన యువతులు వీరే.. ఇదే కారణం..
బళారి: ఉమ్మడి బళ్లారి జిల్లా కొట్టూరులోని ఇందు కళాశాలకు చెందిన కవిత అనే విద్యార్థిని ఆర్ట్స్ విభాగంలో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించారు. హెచ్‌పీఈడీ (హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్) గ్రూపులో 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు సాధించిన ముగ్గురిలో ఒకరిగా నిలిచి కళాశాలకు, తల్లిదండ్రులకు కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ప్రిన్సిపాల్ పవన్‌కుమార్‌తో పాటు సిబ్బంది, విద్యార్థులు విద్యార్థినిని అభినందలతో ముంచెత్తారు.
PUC Results: ద్వితియ పీయూ పరీక్ష ఫలితాల్లో జిల్లా స్థానం ఇది..
తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేరుస్తా..
కూడ్లిగి తాలూకాలోని చౌడాపుర గ్రామానికి చెందిన కవిత రోజూ సొంత గ్రామం నుంచి బస్సులో వచ్చి వెళుతూ చదువుకునేది. రైతు వీరబసప్ప, తల్లి విశాలమ్మలకు పెద్ద కుమార్తె కాగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి చిన్నప్పటి నుంచి ఇష్టపడి చదువుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. కవిత మాట్లాడుతూ.. మా నాన్నకు ఇద్దరు కుమార్తెలమని, ఇష్టపడి చదవడం వల్ల రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించేందుకు వీలయిందన్నారు. నాన్న రైతుగా పని చేస్తూ ఎన్నో కష్టాలు, నష్టాలు చవిచూశారని పేర్కొంది. ఆయన ఆశయాలను నెరవేర్చే ఐఏఎస్ లేదా కేఏఎస్ సాధించి జిల్లా స్థాయి అధికారిణిగా పని చేసి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉందన్నారు.
TOEFL Exam: విజయవంతంగా ‘టోఫెల్’ ప్రైమరీ
సైన్స్‌లో విద్యాలక్ష్మికి ఫస్ట్ ర్యాంక్
వాణిజ్య నగరి హుబ్లీ విద్యార్థిని ఏ.విద్యాలక్ష్మి ద్వితీయ పీయూసీ సైన్స్ పరీక్షల్లో 598 మార్కులు సాధించి రాష్టానికే తొలి ర్యాంకర్‌గా ఘనత సాధించారు. బైరదేవరకొప్పలోని చౌగులె విద్యా సంస్థ విద్యానికేతన్ సైన్స్ కాలేజీ విద్యార్థినిగా ఈమె పీయూసీలో భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, గణితం, జీవశాస్త్ర విషయాలను ఎంచుకుంది. ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాసి 600లకు గాను 598 మార్కులు సాధించి తొలి ర్యాంకర్‌గా విద్యాలక్ష్మి కీర్తి దక్కించుకుంది. ఈమె తండ్రి ఎస్.అఖిలేశ్వరన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఈయన స్వస్థలం తమిళనాడు అయినా 2002 నుంచి హుబ్లీలోనే నివాసం ఉంటున్నారు.