JNTUKలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్ల భర్తీ

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకేలో త్వరలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు తీసుకుంటామని జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు పేర్కొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సత్కరిస్తున్న వీసీ ప్రసాదరాజు

 వర్సిటీ అవరణలో ఆగ‌స్టు 15న‌ 77వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఎన్‌సీసీ వలంటీర్ల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ ఏడాది బీటెక్‌లో సీఎస్‌ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులతో పాటు ఎంఎస్సీ డేటా సైన్స్‌,ఎంబీఏ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ప్రారంభించామన్నారు.

చదవండి: NAAC A+ Grade for JNTUK: భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో ఎంవోయు... సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ స్థాయి విద్యాబోధనకు ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఆయన సత్కరించారు. కార్యక్రమంలో రెక్టార్‌ కేవీ రమణ,రిజిస్ట్రార్‌ సుమలత,స్పోర్ట్స్‌ కౌన్సెల్‌ కార్యదర్శి శ్యామ్‌కుమార్‌ పాల్గొన్నారు.

చదవండి: Foreign Education : ఇక్కడ సీటొస్తే చాలు.. ఎంచ‌క్కా..విదేశాల్లో చదవొచ్చు ఇలా..

#Tags