Jobs in Abroad: విదేశాలలో ఉద్యోగ అవకాశాలు

రాజమహేంద్రవరం రూరల్‌: జాతీయ నైపణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త అధ్వర్యంలో విదేశాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాధికారి ఎం.కొండలరావు బుధవారం ప్రకటనలో తెలిపారు.
Job Opportunities Abroad

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ కౌశల్‌ మహోత్సవంలో భాగంగా విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో పలు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కల యువతీ యువకులు తమ వివరాలను ముందుగా shorturl.at/yFJT9లో ఈనెల 16వ తేదీలోపు రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. పీజీ, బీటెక్‌, డిప్లమో, డిగ్రీ, ఐటీఐ, ఇంటర్‌, పదోతరగతి లోపు చదువుకున్న అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు 95818 10049, 99489 95678 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Also read: UK's Scale-Up Visa Scheme: Stay in Britain from 6 months to 5 years with a job!!

 

#Tags