Mega Job Mela: జాబ్‌మేళా పోస్టర్‌ విడుదల

రంపచోడవరం: రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ జగదీష్‌ ఆడహళ్లి కోరారు.
జాబ్‌మేళా పోస్టర్‌ విడుదల

రంపచోడవరం క్యాంప్‌ కార్యాలయంలో జూలై 26న‌ ఆయన మెగా జాబ్‌ మేళా పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహకులు జి. ప్రశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండి ఇంటర్‌, డిప్లమో, డిగ్రీ ,బీటెక్‌ చదివిన యువత ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూలై 28న జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటల వరకు ఉంటుందన్నారు. వివరాలకు 6304634447 నంబరులో సంప్రదించాలని కోరారు.

చదవండి:

7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

#Tags