Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.

పటాన్‌చెరు టౌన్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదైన ఘటన అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. అమీన్‌పూర్‌ కేఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన శ్యాంప్రసాద్‌కు అతడి స్నేహితుడు విజయ్‌ హైదరాబాద్‌ ఇన్ఫోసిస్‌లో సీనియర్‌ కన్సల్టెన్‌గా పని చేస్తున్న రాంబాబు అనే వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. అతడు ఉద్యోగాలు పెట్టిస్తాడని శ్యాంప్రసాద్‌ను నమ్మించాడు.

శ్యాంప్రసాద్‌ గతేడాది సెప్టెంబర్‌ 20వ తేదీన రాంబాబుకు ఫోన్‌ చేసి తన ఉద్యోగం కోసం అడిగాడు. అడ్వాన్స్‌గా రూ.25 వేలు ఇవ్వాలని చెప్పడంతో పంపించాడు. శ్యాంప్రసాద్‌తోపాటు మరో 8 మంది స్నేహితులు తమకు కూడా ఉద్యోగాలు కావా లని రూ.2.30 లక్షలు రాంబాబుకు పంపించారు.

చదవండి: DMHO: నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు

ఉద్యోగం వచ్చిన తర్వాత అదనంగా ప్రతి ఒక్కరూ రూ. 50 వేలు చెల్లించాలని చెప్పాడు. బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఆఫర్‌ లెటర్‌ వస్తుందని నమ్మించాడు.

అనంతరం ఎంత ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో బాధితులంతా ఏప్రిల్‌ 5న‌ అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌తో ఫిర్యాదు చేయగా రాంబాబుపై కేసు నమోదు చేశారు.

#Tags