Gurukula schools: గురుకుల ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తు గడువు పొడిగింపు.. చివరితేది ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠ‌శాల‌ల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి డిసెంబర్‌ 15న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశానికి విద్యార్థులు ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. 

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు డిసెంబరు 18న ప్రారంభం అయ్యింది. జనవరి 6న ముగిసిన దరఖాస్తు గడువును జన‌వ‌రి 20 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు అధికారులు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీ ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నాం ఒంటి గంట వ‌ర‌కు పరీక్ష నిర్వహించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, దీంతోపాటు బోనఫైడ్‌/స్టడీ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

సీట్ల వివరాలు ఇవే..

సొసైటీ                 బాలికలు         బాలురు          సీట్ల సంఖ్య 
ఎస్సీ గురుకులాలు     141       91       18,560
ఎస్టీ గురుకులాలు        46        36         6,560
బీసీ గురుకులాలు       146      148      23,680
సాధారణ సొసైటీ          20         15        3,124
మొత్తం                       353       290     51,924

చదవండి:

Korukonda Sainik School: ప్రగతిపథంలో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌

Admissions: పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయ్‌

#Tags