Tenth Class Public Exams 2024 News : విద్యార్థుల‌కు ముఖ్య గ‌మ‌నిక‌.. ఇకపై టెన్త్‌ పబ్లిక్ పరీక్షలు ఉండవ్‌.. ఇదే నిజ‌మేనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇకపై కొత్త విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింద‌ని.. 36 ఏళ్ల తర్వాత కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తోంద‌ని.. ఇది అమ‌లులోకి వ‌స్తే.. ఇక‌పై టెన్త్‌ తరగతికి పబ్లిక్‌ పరీక్షలు ఉండవ్ అంటు ప్ర‌చారం చేస్తున్నారు.
Tenth Class Final Exam Cancel Fake News

అలాగే ఈ కొత్త విద్యా విధానంలోని అతి ముఖ్యమైన ప్రతిపాదనలు ప్ర‌కారం ఇక‌పై 10వ తరగతికి బోర్డు పరీక్షలు ఉండ‌వ్ అని.. 5వ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష, స్థానిక భాష, జాతీయ భాషలలో మాత్రమే బోధన ఉంటుంద‌ని.. మిగిలిన సబ్జెక్టులు, ఇంగ్లీష్‌ అయినా సబ్జెక్టుగా బోధిస్తార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అలాగే ఇంతకుముందు 10వ త‌ర‌గ‌తి బోర్డ్‌ పరీక్షల‌కు హాజరు కావడం తప్పనిసరి అని.. అది ఇప్పుడు రద్దు అయ్యింద‌ని వివిధ వెబ్‌సైట్‌ల‌లో న్యూస్ రాస్తున్నారు.

అలాగే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమిస్టర్‌ వారీగా పరీక్ష జరుగుతుందని.. పాఠశాల విద్యను 5G3G3G4 ఫార్ములా ప్ర‌కారం బోధిస్తార‌ని..  ప్ర‌చారంలో ఉంది. అయితే  PIB మాత్రం ఇవ‌న్ని వాస్త‌వం కాదు అని కొట్టిపారేసింది. అలాగే ఇలాంటి వార్త‌ల‌ను విద్యార్థులు అసలు న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలిపింది. అలాగే టెన్త్‌ పబ్లిక్ పరీక్షలు ఈ ఏడాది ఎప్ప‌టిలాగా ఖచ్చితంగా జ‌రుగుతాయ‌ని తెలిపింది.

#Tags