YS Jagan Mohan Reddy: విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలి

నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ యూనివర్సిటీల ఆన్‌లైన్‌ కోర్సులను ఎడెక్స్‌ సంస్థ ద్వారా అందించేందుకు ఒప్పందం చేసుకోవడం గర్వకారణమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.రామచంద్రారెడ్డి తెలిపారు.

ఫిబ్ర‌వ‌రి 16న‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ఎడెక్స్‌ ప్రతినిధులు సీఎం ఆధ్వర్యంలో ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా నెల్లూరు కలెక్టరేట్‌ నుంచి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.రామచంద్రారెడ్డి, సీడీసీ డీన్‌ సీహెచ్‌ విజయ హాజరయ్యారు.

చదవండి: Higher Education: ఉన్నత విద్యలో మరో చరిత్ర.. ఉచితంగా రూ.30 వేలు విలువ చేసే కోర్సు!!

ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మన విద్యార్థులు గ్లోబల్‌ సిటిజన్లుగా ఎదిగేందుకు ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు గల విశ్వవిద్యాలయాల్లో లభించే కోర్సులను ఎడెక్స్‌ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ద్వారా ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. దీంతో ప్రపంచస్థాయిలో భాషా పరిజ్ఞానం, నైపు ణ్యం పెంపొంది మన విద్యార్థులు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతారని తెలిపారు.

#Tags