IIT Madras Raises 513 Crore In Donations: ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థులు, దాతల నుంచి భారీ విరాళాలు
ఐఐటీ మద్రాస్‌కు పూర్వ విద్యార్థులు, ఇతర దాతలు, కార్పొరేట్ సంస్థలు అనూహ్య రీతిలో భారీస్థాయిలో విరాళాల రూపంలో సాయం అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.513 కోట్ల నిధులను సమకూర్చారు. గతేడాదితో పోలిస్తే ఇది 135 శాతం కంటే ఎక్కువ అని విద్యాసంస్థ వర్గాలు వెల్లడించాయి.
2020-21లో రూ.101.2 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.131 కోట్లు, 2022-23 గాను రూ.231 కోట్లు, 2023-24లో రూ. 513 కోట్లు సమకూర్చినట్లు ఐఐటీ మద్రాస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే విరాళాలు భారీగా పెరిగాయి. రూ.కోటి కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన దాతలు 48 మంది ఉన్నారని విద్యాసంస్థ తెలిపింది.
పూర్వ విద్యార్థులు, దాతలు, కార్పొరేట్ సంస్థల నుంచి అందిన విరాళాలలను రీసెర్చ్,మౌలిక వసతుల కల్పన, స్కాలర్ షిప్‌లు, రీసెర్చ్ ఫండ్‌కు వినియోగించనున్నట్టుగా విద్యాసంస్థ వర్గాలు పేర్కొన్నాయి. అదనంగా అర్హులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు, సంస్థ మౌళిక సదుపాయాల కోసం ఉపయోగించనున్నారు.