APRCET 2024-25: ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఆర్‌సెట్.. ఫలితాలు విడుదల తేదీ ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి/తిరుపతి సిటీ: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి చేపట్టిన ఏపీ ఆర్‌సెట్ 2024–25 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద రాజు వెల్లడించారు.
మే 5న వర్సిటీలో ఆయన మాట్లాడుతూ మే 2వ తేదీ నుంచి ఈ పరీక్షలు హైదరాబాద్, రాష్ట్రంలోని 16 కేంద్రాల్లో నిర్వహించినట్లు చెప్పారు.
పరీక్షలకు 10,050 మంది దరఖాస్తు చేసుకోగా 8,651 మంది హాజరయ్యారన్నారు. దీంతో 86.5 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. ఫలితాలు మే 15వ తేదీ విడుదల చేస్తామన్నారు. జూన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు.
చదవండి:
AP IIIT Admissions : ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే..
Agniveer Jobs: జూన్ 20న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఈ వయసు లోపు వారు మాత్రమే అర్హులు
Published date : 06 May 2024 03:35PM