Admissions: గురుకుల కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు తేదీలు ఇవే..

భువనగిరి : జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ఆగ‌స్టు 22వ తేదీన స్పాట్‌ ఆడ్మిషన్లు నిర్వహించనున్నట్ల జిల్లా సాంఘికక సంక్షేమ గురుకుల సంస్థ సమన్వయ అధికారి శ్రీరాం శ్రీనివాస్‌ ఆగ‌స్టు 18న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
గురుకుల కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు తేదీలు ఇవే..

 2023–24 విద్యా సంవత్సరానికి గాను భువనగిరి, రాజాపేట, మోత్కూరు బాలుర, ఆలేరు, వలిగొండలోని బాలికల గురుకుల కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థులు ఉదయం 11 గంటలకు భువనగిరి గురుకుల కళాశాలలో హాజరు కావాలన్నారు. విద్యార్థులు పదో తరగతిలో 8 జీపీఏకు పైగా ఉండాలన్నారు.

చదవండి:

BRAOU: ఓపెన్‌ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

KGBV: కస్తూర్బా కాలేజీల్లో సీట్లు ఖాళీ

Admissions: విద్యార్థినుల చదువుకు సోపానం

#Tags