BRAOU: ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2023–2024 విద్యా సంవత్సరానికి డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేడ్కర్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ చిత్తనూరి మల్లేశం ఆగస్టు 18న తెలిపారు.
ఇంటర్, ఓపెన్ ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, సంబంధిత సర్టిఫికెట్లతో మానుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వెరిఫికేషన్ చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9160538938 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Published date : 19 Aug 2023 05:46PM