Telangana Model School:తెలంగాణ మోడల్‌ స్కూల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపిక

Telangana Model School:తెలంగాణ మోడల్‌ స్కూల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపిక

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జేఈటీ సూపర్‌ 20 స్కాలర్‌షిప్‌కు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు భావన, మనస్విని, దీపికకు గురువారం పాఠశాల ఆవరణలో సంస్థ డైరెక్టర్‌ అరుణ్‌తో కలిసి స్కాలర్‌షిప్‌ పత్రాలు అందించి అభినందించారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ జటాధరా ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ 20 స్కాలర్‌షిప్‌ కోసం 20 మంది పదో తరగతి పాసైన విద్యార్థులను ఎంపిక చేశారని తెలిపారు. ఇందులో ముగ్గురు మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఉండటం సంతోషకరమన్నారు. విద్యార్థులకు రెండేళ్లు ఐఐటీ, జేఈఈ పరీక్షలకు ఆన్‌లైన్‌ ద్వా రా ఉచిత కోచింగ్‌ అందిస్తారని తెలిపారు.

Also Read:  ఏపీ, తెలంగాణలో అగ్రిడిప్లొమా కోర్సులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

#Tags