Agri-Diploma Courses Notification : ఏపీ, తెలంగాణలో అగ్రిడిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ విడుదల.. విద్యార్థులకు తత్వర కొలువులు..!
తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో.. అగ్రికల్చల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాచిలర్ స్థాయి కోర్సులకు కూడా త్వరలోనే ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణలో..
అగ్రికల్చరల్ డిప్లొమా, డిగ్రీ కోర్సులు.. ప్రవేశ విధానాలు.. భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక కథనం..
పదో తరగతి తర్వాత విద్యార్థుల ముంగిట ఎన్నో కోర్సులు. అధిక శాతం మంది ఇంజనీరింగ్, మెడిసిన్ లక్ష్యంగా ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్‌తో ఇంటర్‌లో చేరుతున్నారు. అదేవిధంగా సత్వర ఉపాధి కోసం కొంతమంది డిప్లొమా కోర్సులను ఎంచుకుంటున్నారు. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మరో ప్రత్యామ్నాయం అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు.
Temporary Based Posts : ఐఐఆర్‌ఆర్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..
పదో తరగతితో అగ్రి డిప్లొమా
పదో తరగతి ఉత్తీర్ణతతోనే అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో చేరొచ్చు. వ్యవసాయ రంగానికి సంబంధించి క్షేత్ర నైపుణ్యాలు అందించే కోర్సులు ఇవి. వీటికోసం ప్రత్యేకంగా పాలిటెక్నిక్స్‌ను సైతం నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, అదే విధంగా తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వహిస్తున్నారు.
పలు విభాగాలు
- అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు సంబంధించి ప్రస్తుతం పలు విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సు వ్యవధి మూడేళ్లు. మిగతా కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు.
Junior Research Fellow : ఐకార్–ఐఐఓఆర్‌లో 12 జూనియర్ రీసెర్చ్ ఫెలోలు.. దరఖాస్తులకు చివరి తేది..
భారీ సంఖ్యలో సీట్లు
అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌లో 260 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో 540 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్స్‌లో 688 సీట్లు, ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో 2,530 సీట్లు ఉన్నాయి.
ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వ్యవసాయ పాలిటెక్నిక్స్‌లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
ఎంపిక ఇలా
అగ్రి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ, తెలంగాణలో వేర్వేరు నిబంధనలు అమలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో.. విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు టీఎస్ పాలిసెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీలో పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లు కేటాయిస్తారు.
JoSAA Counselling 2024: 'జోసా' తొలిదశ సీట్ల కేటాయింపు పూర్తి.. ముంబై ఐఐటీకే టాపర్ల ప్రాధాన్యం
పల్లే విద్యార్థులకు వెయిటేజీ
సీట్ల కేటాయింపులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా వెయిటేజీ కల్పిస్తున్నారు. తెలంగాణలో.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 60 శాతం సీట్లను కేటాయిస్తారు. ఏపీలో నిబంధనల ప్రకారం–పదో తరగతిలోపు కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివిన వారికి మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను, పట్టణ ప్రాంతాల్లో చదివిన వారికి 25 శాతం సీట్లను కేటయిస్తారు.
ఇంగ్లిష్ మీడియం బోధన
అగ్రికల్చర్ డిప్లొమాలను ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు. ఆయా రంగాల్లోని వాస్తవ పరిస్థితులను క్షేత్ర స్థాయిలో అవగాహన చేసుకోవడంతోపాటు, డిప్లొమా తర్వాత జాబ్ మార్కెట్, ఉన్నత విద్యావకాశాలు అందిపుచ్చుకోవడంలో ఇంగ్లిష్ భాష దోహదపడుతుందని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
Hospitality Industry: ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!.. త్వరలోనే 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
కెరీర్ అవకాశాలు
- అగ్రికల్చర్, డెయిరీ, హార్టికల్చర్(ఉద్యాన) విభాగాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఈ రంగంలో కెరీర్ అవకాశాలు మెరుగవుతున్నాయి.
- పదో తరగతి అర్హతతోనే ఈ విభాగాల్లో నైపుణ్యం సాధించేందుకు, ఆ తర్వాత ఉద్యోగం, స్వయం ఉపాధి పొందేందుకు డిప్లొమా కోర్సులు దోహద పడుతున్నాయి.
- ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, న్యూట్రియంట్ పరిశ్రమల్లో ప్లాంట్ అసిస్టెంట్, టెక్నీషియన్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రారంభంలోనే నెలకు రూ.15 వేల వరకు వేతనం అందుకోవచ్చు.
- ఉన్నత విద్య పరంగా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసుకుంటే.. విత్తన ఉత్పత్తి కేంద్రాలు, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్నత స్థాయి కొలువులు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ప్రభుత్వ విభాగాల్లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల్లోనూ అవకాశాలు లభిస్తాయి.
ఉన్నత విద్యలోనూ ప్రాధాన్యం
అగ్రికల్చర్, అనుబంధ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకున్న వారికి బ్యాచిలర్ డిగ్రీ ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. ఇందుకోసం వీరికి ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయిస్తారు. అదే విధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా పూర్తి చేసుకున్న వారు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు. ఇందుకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష (అగ్రిసెట్)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
TSPSC Group 2 & 3 Posts 2024 Increase : గ్రూప్–2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య భారీగా పెంపు..? ఇంకా గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో..
ఈఏపీ సెట్‌తో బ్యాచిలర్ కోర్సులు
- అగ్రికల్చర్ విభాగంలో.. ఇంటర్మీడియెట్ అర్హతతో బ్యాచిలర్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీ ఆనర్స్ (అగ్రికల్చర్), బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బీఎస్సీ ఆనర్స్–కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు ఈఏపీ–సెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- బీఎస్సీ అగ్రికల్చర్ ఆనర్స్, కమ్యూనిటీ సైన్స్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్‌ఎస్‌సీ, బీఎస్సీ ఆనర్స్–హార్టికల్చర్ కోర్సుల సీట్లను ఈఏపీ–సెట్ బైపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సీట్లను ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. దీంతోపాటు.. బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ సీట్లను ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
- ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది.
Bill Gates On AI Impact On Software Engineers: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ముప్పు తప్పదా.. బిల్ గేట్స్ ఏం చెప్పారు?
ఉన్నత ఉద్యోగాలు
- అగ్రికల్చర్ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో ఉజ్వల కెరీర్ అవకాశాలు స్వాగతం పలుకుతాయనడంలో సందేహం లేదు.
- అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసుకున్న వారికి ప్రైవేటు రంగంలో విత్తన తయారీ సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ విభాగాల్లో వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ వంటి కొలువులు దక్కించుకోవచ్చు. బ్యాంకుల్లో సైతం రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
- బీటెక్–ఫుడ్ టెక్నాలజీ సర్టిఫికెట్‌తో.. ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో కొలువుదీరొచ్చు. అదే విధంగా.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, క్రాప్ పొడక్షన్ కంపెనీలలో మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
- బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటే.. అగ్రి ఎక్విప్‌మెంట్ సంస్థలు, క్రాప్ పొడక్షన్ కంపెనీలలో సాంకేతిక విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
- బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ పూర్తి చేసుకుంటే.. హాస్పిటల్స్, చైల్డ్‌కేర్ ఇన్‌స్టిట్యూట్స్, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్, ఎన్‌జీఓలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
అగ్రికల్చర్ కోర్సులు..
ముఖ్యాంశాలు
- అగ్రికల్చర్ డిప్లొమా, డిగ్రీ కోర్సులతో ఉన్నత విద్య, ఉపాధి మార్గాలు.
- సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు.
- ప్రభుత్వ విభాగంలోనూ వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఉద్యోగాలు.
- నెలకు రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు వేతనం అందుకోవచ్చు.
- బ్యాచిలర్ కోర్సులకు ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు.
- డిప్లొమా కోర్సులకు తెలంగాణలో పాలిసెట్ ర్యాంకు; ఏపీలో పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక.
Junior Lineman jobs news: జూనియర్ లైన్‌మెన్ల(జేఎల్‌ఎం)ఎంపిక పరీక్ష ఎప్పుడంటే..
ఏపీలో అగ్రికల్చరల్ డిప్లొమా.. ముఖ్య సమాచారం
- అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయసు: ఆగస్ట్ 31 నాటికి 15–22 ఏళ్లు ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024,జూన్ 20
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://angrau.ac.in
తెలంగాణలో అగ్రికల్చరల్ డిప్లొమా.. ముఖ్య సమాచారం
- అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, టీఎస్ పాలిసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) అర్హత.
- వయసు: డిసెంబర్ 31, 2024 నాటికి 15–22 ఏళ్లు ఉండాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూన్ 25
- ఆన్‌లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: 2024, జూన్ 27
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://diploma.pjtsau.ac.in
Tags
- Agriculture courses
- Diploma in Agriculture
- various courses in agriculture
- admissions
- notification 2024
- Tenth Students
- TS POLYCET
- online applications
- age limit for agriculture courses
- Diploma in Agriculture in AP and TG
- easy employment and job offers with agriculture course
- Education News
- public sector education
- private sector education
- Qualifications
- Vocational Education Course
- Career Opportunities
- 10thClass
- Intermediate
- latest admissions in 2024
- sakshieducationlatest admissons