RGUKT: ట్రిపుల్‌ ఐటీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

ట్రిపుల్‌ ఐటీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ యూని వర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023– 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టి ఫికెట్ల పరిశీలన జూలై 5న నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ప్రారంభమైంది. కార్యక్రమాన్ని చాన్సలర్‌ ఆచార్య కేసీ రెడ్డి ప్రారంభించారు.

చదవండి: RGUKT Admissions: ట్రిపుల్‌ ఐటీలకు 38,100 దరఖాస్తులు!

ఎన్‌సీసీకి సంబంధించి 250 మంది, మాజీ సైనిక ఉద్యోగుల కోటాకు సంబంధించి 65 మంది అభ్యర్థులు హాజరైనట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు.  

చదవండి: సగానికిపైగా తగ్గిన దరఖాస్తులు.. నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తులు ఇలా..

#Tags