Skip to main content

NIT Graduation Ceremony: ఘనంగా నిట్‌ స్నాతకోత్సవం

NIT Graduation Ceremony
NIT Graduation Ceremony

తాడేపల్లిగూడెం: జీవితం వంద మీటర్ల పరుగు పందెం కాదని.. అది మారథాన్‌ అని.. దానికనుగుణంగా సిద్ధపడాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బోర్డు ఆఫ్‌ గవర్నెన్స్‌ చైర్మన్‌, డాక్టర్‌ రవి శర్మ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. ఏపీ నిట్‌ ఆరో స్నాతకోత్సవ వేడుక శనివారం సాయంత్రం నిట్‌ రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

Telangana Anganwadi 11000 jobs Notification: Click Here

రవి శర్మ మాట్లాడుతూ నిత్యాన్వేషిగా ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడంపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు విభిన్న ఆలోచనలు చేస్తూ నూతన ప్రాజెక్టులు చేపడితే చరిత్రలో నిలిచిపోతారన్నారు. నిట్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ బీఎస్‌.మూర్తి మాట్లాడుతూ ఏపి నిట్‌ ప్రగతి పథంలో వెళ్తుందన్నారు. ప్రయోగశాల, పరిశోధనా పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాల నిమిత్తం కేంద్రం రూ.754 కోట్లు మంజూరు చేయనుందన్నారు.


అంతర్జాతీయ జర్నల్స్‌లో 181 పరిశోధనా వ్యాసాలు ప్రచురితం కాగా, వివిధ సమావేశాలలో 121 పత్రాలు సమర్పించారన్నారు. తమ విద్యార్ధులు 70 శాతం ప్లేస్‌మెంట్‌ సాధించడం శుభపరిణామమన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు అందచేశారు. రిజిస్ట్రార్‌ దినేష్‌ రెడ్డి, డీన్‌లు శాస్త్రి, కురుమయ్య, వీరేష్‌కుమార్‌, జయరామ్‌, కార్తీక్‌ శేషాద్రి, వి.సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 19 Aug 2024 04:09PM

Photo Stories