Skip to main content

Outsourcing employees news: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన

Outsourcing employees protest
Outsourcing employees protest

చెన్నూర్‌: తెలంగాణ మెడికల్‌, హెల్త్‌ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు: Click Here

ఆ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఇరికిల్ల మహేశ్‌, శ్రీనివాస్‌ మాట్లాడుతూ సూర్యపేట జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రజినీ మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.

వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతీ నెల వేతనాలను సకాలంలో విడుదల చేయాలని, ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రజినీ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సత్యనారాయణకు అందజేశారు.

Published date : 21 Aug 2024 05:50PM

Photo Stories