RGUKT Admissions: ట్రిపుల్ ఐటీలకు 38,100 దరఖాస్తులు!
రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం 38,100 దరఖాస్తులు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పేర్కొన్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా మరో 100 సీట్లు కలిపి 1100 సీట్లు ఉన్నాయని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించి మార్కులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించనున్నారు.
RGUKT సీట్లు
ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలుల్లోని క్యాంపస్‌లలో 1000 సీట్ల చొప్పున మొత్తం నాలుగు క్యాంపస్‌లలో 4000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రతి క్యాంపస్‌లో 100 (10%) చొçప్పున 400 అదనపు సూపర్‌న్యూమరీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 4400 సీట్లలో 85% ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ప్రతిభ ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులకు (నాన్ లోకల్) ఓపెన్ కేటగిరీలో ఎంపిక చేస్తారు.
రిజర్వేషన్
ట్రిపుల్‌ఐటీలోని సీట్ల భర్తీ విషయంలో రిజర్వేçషన్ల ప్రకారం-విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ-15 శాతం, ఎస్టీ-6 శాతం, బీసీ ఏ-7 శాతం, బీసీ బీ-10 శాతం, బీసీ సీ-1 శాతం, బీసీ డీ-7 శాతం, బీసీ ఈ-4 శాతం, దివ్యాంగులకు 5 శాతం, సైనికుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీకి -1 శాతం, క్రీడా కోటా కింద 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. టిపుల్ ఐటీలోని మొత్తం సీట్లలో అన్ని కేటగిరీలలో అమ్మాయిలకు 33 1/3 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
ఫీజు
ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశం పొందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు మొదటి రెండేళ్ల పీయూసీలో ఏడాదికి రూ.45,000; ఆ తర్వాత నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ఏడాదికి రూ.50,000 ఫీజు చెల్లించాలి.విద్యార్థుల కుటుంబీకుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండి, ఫీజు రీయింబర్స్‌మెంట్(విద్యా దీవెన)కు అర్హులైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
కోర్సులు
ఆరేళ్ల ఇంటెగ్రేటెడ్ ప్రోగ్రామ్‌ను రెండు దశలుగా విభజించారు. మొదటి దశలో రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, తెలుగు/సంస్కృతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ సబ్జెక్టులను బోధిస్తారు. తర్వాత దశలో నాలుగేళ్ల బీటెక్ కోర్సులో పీయూసీలో విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు ఎంపిక చేస్తారు. అందుబాటులోని బ్రాంచ్‌లు.. కెమికల్ ఇంజనీరింగ్(నూజివీడు, ఆర్‌కేవ్యాలీలో మాత్రమే), సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్(నూజివీడు, ఆర్‌కేవ్యాలీలో మాత్రమే)