‘గిరి’ గ్రామాల్లో సైన్స్‌ ఒలింపియాడ్‌ స్కూళ్లు

ఉట్నూర్‌: ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో ఉమ్మడి జిల్లాలో ఎనిమిది సైన్స్‌ ఒలింపియాడ్‌ మోడల్‌ ఆశ్రమ పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభం కానున్నాయి.
‘గిరి’ గ్రామాల్లో సైన్స్‌ ఒలింపియాడ్‌ స్కూళ్లు

బాల,బాలికలకు వేర్వేరుగా ప్రతి జిల్లాకు రెండు ఆశ్రమ పాఠశాలల చొప్పున 8 మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న 4, 5, 6, 7, తరగతుల్లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించే ప్రవేశపరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

చదవండి: Department of Education: స్కూళ్లు తెరిచే నాటికే యూనిఫాం

ప్రతిపాదనలు సిద్ధం..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 132 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 36 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో సైన్స్‌ ఒలింపియాడ్‌ మోడల్‌ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ఏయో ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి విద్యార్థుల ప్రవేశాలకు ఇబ్బంది లేకుండా ఎంపిక కోసం తెలంగాణ‌ గిరిజన సంక్షేమ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.

చదవండి: Schools Closed & Work from Home: స్కూళ్లు బంద్‌.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ప్రత్యేక బోధన..

ఒలింపియాడ్‌ మోడల్‌ ఆశ్రమ పాఠశాలల్లో ఎంపికై న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక విద్యాబోధన అందించనున్నారు. గణితం, సైన్స్‌, ఇంగ్లిష్‌ ప్రాధాన్యత గుర్తించి ప్రభుత్వం ఆయా అంశాల్లో వారిని తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 4, 5, 6, 7 తరగతి చదువుతున్న విద్యార్థులకు సైన్స్‌ ఒలింపియాడ్‌ మోడల్‌ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రవేశపరీక్ష ఉంటుంది. మొత్తం 5,200 మంది పరీక్షకు హాజరుకానున్నారు.

చదవండి: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు

ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాసేవారు..

జిల్లా ఆశ్రమపాఠశాలలు విద్యార్థుల సంఖ్య

ఆదిలాబాద్‌ - 51 2040
ఆసిఫాబాద్‌ - 46 1840
మంచిర్యాల - 16 640
నిర్మల్‌ - 17 680

ఏర్పాట్లు పూర్తి

ఒలింపియాడ్‌ మోడల్‌ ఆశ్రమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 5200 మంది గిరిజన విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పకడ్బందీగా పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
– జగన్‌, ఏసీఎమ్‌వో, ఐటీడీఏ ఉట్నూర్‌
 

#Tags