Department of Education: స్కూళ్లు తెరిచే నాటికే యూనిఫాం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
నవంబర్ 29న ఆమె పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. మన ఊరు–మన బడి, యూనిఫాం సరఫరా అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
2023లో 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో యూనిఫాం అందించాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య తారతమ్యాల దూరానికి యూనిఫాం అవసరమని ఆమె తెలిపారు. ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో యూనిఫాం సిద్ధం చేయాలని సూచించారు.
Published date : 30 Nov 2022 03:11PM