Skip to main content

మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించడం, సరైన బోధనతో సంపూర్ణ సామర్థ్యాలు సంతరించుకోవడమే లక్ష్యంగా పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
Sarvanga Sundaranga government schools
మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు

క్లాస్‌రూమ్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్త విధానం అమలులోకి రానుంది. పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న ‘సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ (సాల్ట్‌) కార్యక్రమంలో భాగంగా తరగతి గది ఆధారిత మూల్యాంకన విధానాన్ని తెస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్ధులకు సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీ ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు సీబీఏ మార్గదర్శకాలు, షెడ్యూల్‌తో ఆక్టోబర్‌ 3న సర్క్యులర్‌ జారీ అయింది. ఈ పరీక్షలు పూర్తిగా ఓఎమ్మార్‌ (ఆప్టికల్‌ మార్కు రికగ్నిషన్‌) విధానంలో ఏడాదికి మూడుసార్లు జరుగుతాయి. తొలివిడత పరీక్షలు నవంబర్‌ 2 నుంచి ప్రారంభమవుతాయి. 

చదవండి: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల

ఈఐతో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ 

నూతన విధానంలో పరీక్షా పత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం ‘ఎడ్యుకేషన్‌ ఇనిషియేటివ్స్‌’ (ఈఐ)తో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం 1 – 8 తరగతుల విద్యార్ధులకు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు), సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ), థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీషు), ఈవీఎస్, గణితం, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల్లో సీబీఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్, బయోలాజికల్‌ సైన్స్‌కి కలిపి ఒకే పేపర్‌ ఉంటుంది. ప్రశ్నపత్రాలు బైలింగ్యువల్‌ (ద్విభాషా) పద్ధతిలో రూపొందిస్తారు. పక్కాగా మూల్యాంకనం ద్వారా విద్యార్ధుల సామర్థ్యాలను కచ్చితంగా గుర్తించి లోటుపాట్లను సరిదిద్దడంపై ఈఐ సంస్థ నివేదిక అందిస్తుంది. బోధనా విధానాలపై ఎస్సీఈఆర్టీకి సిఫార్సు చేస్తుంది. వాటి ఆధారంగా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటారు. 

చదవండి: Dussehra Holidays: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!

ఫార్మేటివ్, సమ్మేటివ్‌ స్థానంలో

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల స్థానంలో సీబీఏ పరీక్షలను నిర్వహిస్తారు. 1–8 తరగతులకు సంబంధించిన 1, 3 ఫార్మేటివ్, సమ్మేటివ్‌ 2 బదులు సీబీఏ పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్‌ 2, 4, సమ్మేటివ్‌ 1 పరీక్షలను యధాతథంగా పాత విధానంలోనే నిర్వహిస్తారు. విద్యార్ధుల సామర్థ్యాలను సంపూర్ణంగా అంచనా వేసేలా ఈఐ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. ఓఎమ్మార్‌ విధానంలో తొలిసారి నిర్వహిస్తున్నందున టీచర్లకు వెబ్‌నార్ల ద్వారా సూచనలు అందించనున్నారు. 

చదవండి: AP CM YS Jagan : ప్రభుత్వ హాస్టళ్లకు తప్పనిసరిగా ఇంటర్నెట్‌ సదుపాయంతో పాటు.. ప్రతి రోజూ

9, 10 పాత విధానంలోనే

గతంలో మాదిరిగానే 9, 10 తరగతుల విద్యార్ధులకు అంతర్గత పరీక్షలను నాలుగు ఫార్మేటివ్, రెండు సమ్మేటివ్‌లతో పాత విధానంలో నిర్వహిస్తారు. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్ల సంఖ్యను ప్రభుత్వం ఆరింటికి కుదించడంతోపాటు అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా ప్రతి పేపర్‌ను 100 మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, ఒడియా తదితర మైనర్‌ మీడియం స్కూళ్లలో మాత్రం 1–8 తరగతుల విద్యార్ధులకు సీబీఏ తరహాలో కాకుండా పాత విధానంలోనే ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షలు ఉంటాయి. 

ప్రైవేట్‌ స్కూళ్లకు ఓఎమ్మార్‌ పంపిణీ ఉండదు

సీబీఏ పరీక్షల ఓఎమ్మార్‌ పత్రాలను ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్ధులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు డీసీఈబీ (డిస్ట్రిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) నుంచి ప్రశ్నపత్రాలను అందుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈఐ సంస్థ విడుదల చేసే ‘కీ’ ఆధారంగా ప్రైవేట్‌ స్కూళ్లలో మూల్యాంకనం చేసి మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

సీబీఏ పరీక్షల షెడ్యూల్‌

1నుంచి 5వ తరగతి వరకు 

తేదీ

పరీక్ష

నవంబర్‌ 2

తెలుగు, మేథమెటిక్స్‌

నవంబర్‌ 3

ఇంగ్లీషు, ఈవీఎస్‌

నవంబర్‌ 4

ఓఎస్సెస్సీ 

6, 7, 8వ తరగతులకు

నవంబర్‌ 2

తెలుగు, మేథమెటిక్స్‌

నవంబర్‌ 3

హిందీ, జనరల్‌ సైన్సు

నవంబర్‌ 4

ఇంగ్లీషు, సోషల్‌ స్టడీస్‌

నవంబర్‌ 5

ఓఎస్సెస్సీ–1, ఓఎస్సెస్సీ–2

9, 10 తరగతులకు ఫార్మేటివ్‌ పరీక్షలు

నవంబర్‌ 2

తెలుగు, మేథమెటిక్స్‌

నవంబర్‌ 3

హిందీ, సైన్స్‌

నవంబర్‌ 4

ఇంగ్లీష్, సోషల్‌ 

నవంబర్‌ 5

ఓఎస్సెస్సీ–1, ఓఎస్సెస్సీ–2

Published date : 04 Oct 2022 03:57PM

Photo Stories